మార్క్ జుకెర్‍‌బర్గ్‌కు ఫోక్స్‌వ్యాగన్ కానుక; ఎందుకిచ్చిందో తెలుసా?

By Ravi

అతి చిన్న వయస్సులోనే బిలియన్ డాలర్ల ఆస్తిని సంపాధించుకున్న, ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' సహ-వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మార్క్ జుకెర్‌బర్క్‌కు జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఓ కానుకను పంపించింది. గ్లోబల్ మార్కెట్లలో ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న బడ్జెట్ కారు 'గోల్ఫ్ జిటిఐ ఎమ్‌కె6'ను నడుపుతున్నందకు ఫోక్స్‌వ్యాగన్ జుకెర్‌బర్గ్‌కు ఈ కానుక పంపించింది.

బిల్ గేట్స్ మాదిరిగా అనతి కాలంలోనే ఇంతటి గొప్ప పేరును, సిరి సంపందలను దక్కించుకున్న మార్క్ జుకెర్‌బర్క్ చాలా సాధారణంగా కనిపిస్తుంటాడు. కోట్ల సరిసంపదలు తన వద్ద ఉన్నప్పటికీ, జుకెర్‌బర్గ్ మాత్రం జీన్స్, టీషర్టులు ధరిస్తూ, ఎమాత్రం గర్వం లేకుండా అందరితీ కలుపుగోలుగా ప్రవర్తిస్తుంటాడు. అతని సింప్లిసిటీకి తగినట్లుగానే తాను నడిపే కారు కూడా సింపుల్‌గా ఉంటుంది.

Mark Zuckerberg

మార్క్ జుకెర్‌బర్గ్ కోట్ల విలువ చేసే ఖరీదైన, విలాసవంతమైన కార్లలో కాకుండా సింపుల్‌గా ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ ఎమ్‌కె6 కారులో ప్రయాణిస్తుంటాడు. జుకెర్‌బర్గ్ తమ బ్రాండ్ కారును నడుపుతున్నట్లు గుర్తించిన జర్మన్ కార్‌‌మేకర్ ఫోక్స్‌వ్యాగన్ హెడ్‌క్వార్టర్స్, ఆయనకు అభినందనలు తెలియజేసేందుకు ఓ కానుకను సమర్పించుకుంది.

జుకెర్‌బర్గ్ కోసం ఒకానొక ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ రెప్రజెంటేటివ్ గిఫ్ట్‌ను ప్యాక్ చేస్తున్న వీడియోను తమ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. మరి ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ మార్క్ జుకెర్‌బర్గ్‌కు ఇచ్చిన కానుక ఏంటో తెలియాలంటే.. ఈ వీడియోని వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/hDzo0eJvdm0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Facebook co-founder Mark Zuckerberg drives a VW Golf GTI Mk6 - with a manual transmission. The news that he owns a Golf GTI didn’t go unnoticed at VW’s headquarters, with the German carmaker deciding to congratulate him for choosing one of its cars. VW uploaded a video on its YouTube corporate account showing one of its representatives packing a gift for Zuckerberg.&#13;
Story first published: Saturday, January 25, 2014, 13:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X