విమానాలన్నీ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి ?

విమానాలన్నీ తెలుపు రంగులో ఉంటాయి కదా ? మరి దీని వెనుక ఏదైనా రీజన్ ఉందా అంటే, ఉందనే చెప్పాలి దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

Written By:

చాలా వరకు విమానాలు దాదాపు తెలుపు రంగులోనే ఉంటాయి. గాలిలో ఎగురుతున్నపుడు లేదా ఎయిర్ ట్రావెల్ చేస్తున్నపుడు మనం చూసే ప్రతి విమానం తెలుపు రంగులోనే ఉంటుంది. పేర్లు, డిజైన్లు మరియు కొన్ని పట్టీలు వివిధ రంగుల్లో ఉన్నపటికీ విమానం ఎక్ట్సీరియర్‌లో ప్రధానమైన రంగు మాత్రం తెలుపే ఉంటుంది.

ఇప్పుడు మీకు కూడా ఈ డౌట్ వస్తోంది కదా...? మరి దీని వెనుక ఏదైనా రీజన్ ఉందా అంటే, ఉందనే చెప్పాలి దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

థర్మల్ అడ్వాంటేజ్ - అన్ని రంగుల్లో కన్నా తెలుపు రంగు కాంతిని అత్యుత్తమంగా పరావర్తనం చెందిస్తుంది. సూర్యరశ్మి నుండి దాదాపు అన్ని రకాల కాంతిని తెలుపు రిఫ్లెక్ట్ చేస్తుంది.

అంతే కాకుండా తెలుపు రంగు మాత్రమే వేడిని గ్రహించదు. మరే ఇతర రంగులతో విమానానికి పెయింట్ చేస్తే, అది సూర్యుని నుండి వచ్చే ఉష్ణోగ్రతను అధిక మొత్తంలో గ్రహిస్తుంది. తద్వారా విమానం యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది.

వేసవి కాలంలో తెల్లటి దుస్తులు మాత్రమే ధరించాలని అంటుంటారు. ఎందుకంటే తెలుపు తక్కువ వేడిని గ్రహిస్తుంది. భారీ ఎండ ఉన్నపుడు ఓ సారి తెల్లటి దుస్తులు మరియు ఓ సారి నలుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి ప్రయత్నించి చూడండి ఎండ ప్రభావం ఏ మేర ఉంటుందో తెలుస్తుంది.

నొక్కులను సులభంగా గుర్తించవచ్చు - విమానం ప్రయాణానికి ముందు ఎక్ట్సీరియర్ మీద తరచూ చీలికలు, నొక్కులు మరియు విమానం శరీర భాగాల మీద డ్యామే‌జ్‌లను పరీక్షిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇతర రంగుల కన్నా తెలుపు రంగు మీద వాటిని సులభంగా గుర్తించవచ్చు.

తుప్పుబట్టిన ప్రదేశాన్ని సులభంగా గుర్తించవచ్చు - లోహం భాగాలు మీద తుప్పు పట్టడాన్ని నివారించడానికి సాధారణంగా పెయింటింగ్ చేస్తారు. అందులో కూడా తెలుపు రంగుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే తుప్పుబట్టిన ప్రదేశాన్ని దానికి వ్యతిరేక రంగులో ఉన్న తెలుపు మీద సులభంగా గుర్తించవచ్చు.

ఇంధన లీకేజీలను గుర్తించవచ్చు - విమానంలో ఇంధనం లీక్ అవుతున్నపుడు వాటి ధారలను తెల్లటి ప్లేన్ బాడీ మీద వెంటనే గుర్తించవచ్చు. మిగతా రంగుల్లో ఈ అంశాన్ని గుర్తించడం కాస్త కష్టమవుతుంది.

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా స్పష్టంగా గమనించవచ్చు - విమానం గరిష్టం దూరంలో ఉన్నా, చీకటిలో ఉన్నా, వర్షం పడుతున్నపుడు మరియు ప్రమాదం జరిగినా కూడా తెలుగు రంగులో ఉన్న దానిని చూసినంత స్పష్టంగా మరే ఇతర వాటిని చూడలేము. అందుకే తెలుపు రంగులో ఉండే ప్యాసింజర్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి.

తెలుపులో విమానాలు ఉండానికి మరే ఇతర సైంటిఫిక్ కారణాలు లేవు. అయితే ఇప్పుడు వచ్చే కారణాలను దృష్టిలో ఉంచుకుని విమాన శరీరం మీద తెలుపు రంగు పెయిటింగ్‌కు ఎక్కువ మొగ్గుచూపుతున్నాయి విమాన తయారీ సంస్థలు..

ధర... విమానానికి పెయింటింగ్ చేయడం అనేది అంత ఆషామాషీ కాదు. ఎక్కువ ఖర్చు, సమయం మరియు పనివాళ్లు అధికంగా కావాల్సి ఉంటుంది. ఓ సాధారణ బోయింగ్ లేదా ఎయిర్ బస్ విమానానికి పెయింట్ చేయడానికి రెండు నుండి వారం రోజుల సమయం తీసుకుంటుంది.

బరువు - చాలా మంది దీనిని నమ్మరు, మన వినియోగించే కార్లు మరియు బైకులకు వినియోగించే పెయింట్ యొక్క బరువు తక్కువగానే ఉంటుంది, అదే విమానం విషయానికి వస్తే, పెయింట్ యొక్క బరువు విమానం యొక్క ప్రయాణం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి తెలుపు మీద అందమైన రంగులతో పెయింట్ చేయడానికి చాలా వరకు విమానయాన సంస్థలు ఆసక్తిచూపవు.

రీసేల్ వ్యాల్యూ - కార్లు మరియు బైకుల తరహాలో విమానాలను కూడా సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ తెలుపు రంగు విమానం కన్నా ఇతర రంగులో ఉన్న విమానం యొక్క రీసేల్ వ్యాల్యూ చాలా తక్కువగా ఉంటుంది.

వర్ణం మారిపోవడం (fade) - నిజానికి చాలా ఎత్తులో ప్రయాణిస్తున్నపుడు విమానం యొక్క రంగు మారిపోవడం (కాంతి హీనమవడం) జరుగుతుంటుంది, దీనికి ప్రధానమైన కారణం, రకరకాల వాతావరణ పరిస్థితులు. అయితే తెలుపు కన్నా ఇతర రంగు వెంటనే షేడ్ అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి షేడ్ అయ్యే అవకాశం లేని తెలుపు రంగును ఎక్కువగా వినియోగిస్తారు.

విమానాలు అదికంగా తెలుపు రంగులో ఉండటానికి గల సైంటిఫిక్ మరియు ఎకనామికల్ కారణాలు వెల్లడించాము కదా... అయినప్పటికీ కొన్ని ఎయిర్ లైన్ సంస్థలు తమ విమానాలను వివిధ రంగులతో పెయింట్ చేయిస్తుంటాయి.

ఈ సారి ఎప్పుడైనా విమానాలు తెలుపు రంగులో ఎందుకు ఉంటాయి అని మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్న రీజన్స్‌తో సమాధానం ఇవ్వండి...

ఎక్కువ మంది వీక్షిస్తున్న ఫోటోలు - మారుతి ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌కు కొనసాగింపుగా 2017 థర్డ్ జనరేషన్ స్విఫ్ట్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న మరియు త్వరలో రానున్నస్విఫ్ట్‌కు మధ్య వ్యత్యాసం చూడాలనుకుంటే క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయాల్సిందే....

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, March 22, 2017, 15:55 [IST]
English summary
Also Read In Telugu: Why Are Airplanes Mostly Painted White Colour
Please Wait while comments are loading...

Latest Photos