ఎన్ని కొత్త ఎస్‌యువిలు వచ్చినా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే జిప్సీనే వినియోగిస్తోంది

By N Kumar

భారతీయులు మారుతి వారి జిప్సీని ఎక్కువగా ఆదరించలేకపోయారు, భారత దేశపు మొదటి ఎస్‌యువిగా వచ్చిన ఇది అంతగా ప్రజాదరణ పొందలేకపోయింది. ఇందులో ఏ/సి లేకపోవడం, పవర్ విండోలు, పవర్ స్టీరింగ్ మరియు ఎన్నో ప్రాథమిక ఫీచర్లు ఇందులో లేకపోవడం కారణాలుగా ఉన్నాయి.

కాని దీనికి పూర్తిగా విరుద్దంగా ఇప్పటికీ ఇండియన్ ఆర్మీ ఈ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది. ఎన్నో అధునాతన ఎస్‌యువిలు వచ్చినప్పటికీ వీటిని ఎందుకు వినియోగిస్తోంది అనేది ప్రశ్నగా ఉంది. దీనికి గల కారణాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

1985 ఏడాది నుండి ఇండియన్ ఆర్మీ మారుతి వారి జిప్సీ ఎస్‌యువిలను తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు వీటిని ఇండియన్ ఆర్మీ వినియోగిస్తోంది. తరువాత స్లైడర్ల ద్వారా దీనికి గల కారణాలను తెలుసుకుందాం....

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

మారుతి జిప్సీ టైర్లు ఇనుప చువ్వల వలన డ్యామేజ్ అయినప్పటికీ, శత్రువుల సరిహద్దుల్లో దొరికిపోయినప్పటికీ అక్కడి నుండి జిప్సీ మాత్రమే తప్పుంచుకోగలదు.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

ధృడమైన శరీర నిర్మాణం కలిగి మరియు ఇందులో ఎటువంటి అనివార్యమైన సదుపాయాలు అందించకపోవడం వలన ఇది తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ రెండు అంశాల వలన జిప్సీ యుద్ద భూమిలో ఉత్తమ పనితీరు కనబరుస్తుంది.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

ఇది గరిష్ట శక్తిని మరియు ఎటువంటి పరిస్థితుల్లోనైనా యుద్ద భూమిలోకి ప్రవేశించి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కారణం ఇందులో 1298 సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ గరిష్టంగా 80బిహెచ్‌పి పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి అతి సమీప పోటీదారైన మహీంద్రా థార్ కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

క్యాబిన్ డిజైన్ పరంగా మారుతి జిప్సీ ఎంతో అద్భుతమైనది, దీని రూఫ్‌ను ధృడమైన, మృదువైన మరియు టాప్ లేకుండా అందిస్తారు.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

ముందు వైపున ఉన్న అద్దాన్ని కావాల్సిన కోణంలో మలుపుకోవచ్చు. మరియు సైనికులు దీనిని నడుపుతున్నపుడు అద్దానికి మరియు డ్రైవర్‌కు మధ్య దూరాన్ని కూడా సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం ఇందులో సైనికులతో పాటు అదనంగా 200 కిలోల బరువును వేసినా కూడా యుద్ద క్షేత్రంలో సునాయసంగా ప్రయాణిస్తుంది. అందుకోసం దీనిని అధిక శాతం సైనికులను మరియు మందుగుండును రవాణా చేయడానికి వినియోగిస్తారు.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

ఇండియన్ ఆర్మీలో జిప్సీ గురించిన తాజ సమాచారం ఏమిటంటే, జిప్సీ స్థానంలో మహీంద్రా స్కార్పియో మరియు టాటా సఫారీలను తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఇది ఇంకా ఆచరణలోకి రాలేదు. ఏదేమైనప్పటికీ మారుతి జిప్సీ వంటి పనితీరు మరే ఇతర వాహనాలతో సాధ్యం కాదు అని మా అభిప్రాయం.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి జిప్సీలనే వినియోగిస్తోంది, ఎందుకు ?

ఈ 45 సాయుధ వాహనాలు భారత సైన్యం యొక్క వెన్నెముక

Most Read Articles

English summary
Why The Indian Army Only Uses Maruti Gypsy And Not Any Other SUV
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X