విండోలెస్ ప్లేన్ కాన్సెప్ట్: గాలిలో పక్షిలా ఎగిరిపోతున్న అనుభూతి!

By Ravi

ఆకాశంలో విమానంలో ఎగురుకుంటూ వెళ్లినప్పుడు కిటికీలో నుంచి, బయటి వాతవారణాన్ని చూడాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అయితే, ప్రస్తత తరం విమానాల్లో కిటికీలు చిన్నవిగా ఉండటం వలన విండో సీట్ వద్ద కూర్చునే ప్యాసింజర్‌కు మాత్రమే ఈ అనుభూతి పొందటం సాధ్యమవుతోంది. కానీ, అది కూడా పూర్తిస్థాయిలో చూడటం సాధ్యం కాదు.

అయితే, భవిష్యత్ విమానాల్లో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇప్పుడు మనం ఈ ఫొటోలలో చూస్తున్న కాన్సెప్ట్ విమానం అలాంటిదే. ఇదొక విండోలెస్ ప్లేన్. అంటే, ఈ విమానంలో కిటికీలు ఉండవని అర్థం కాదు, ప్రతి సీటులో కూర్చునే ప్రయాణీకుడు కూడా విండో సీట్‌లో కూర్చుని పొందే అనుభూతిని పొందవచ్చన్నమాట. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

విండోలెస్ ప్లేన్

తర్వాతి స్లైడ్‌లలో విండోలెస్ ప్లేన్ కాన్సెప్ట్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోండి.

విండోలెస్ ప్లేన్

సెంటర్ ఫర్ ప్రాసెస్ ఇన్నోవేషన్ (సిపిఐ) డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్ విమానంలో, క్యాబిన్ లోపలి భాగాన్ని హై-డెఫినిషన్ స్క్రీన్లతో కవర్ చేయనున్నారు. అలాగే, విమానం బయటి వైపు హై-డెఫినిషన్ మోషన్ సెన్సింగ్ కెమరాలను అమర్చుతారు.

విండోలెస్ ప్లేన్

విమానం బయట అమర్చిన కెమరాలు ఫ్లైట్ టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకూ పనిచేస్తూ, బయట జరుగుతున్న పరిణామాలను, వాతావరణాన్ని యధాతథంగా క్యాప్చూర్ చేస్తూ విమానం లోపలి వైపు ఉన్న హెచ్‌డి స్క్రీన్లపై ప్రొజెక్ట్ చేస్తాయి.

విండోలెస్ ప్లేన్

ఇదంతా చూస్తుంటే, ఫ్లైట్‌కు అసలు పైకప్పు లేనట్లు, ఆకాశంలో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. కేవలం సిపిఐనే కాదు టెక్నికాన్ డిజైన్ అనే సంస్థ కూడా ఇలాంటి ఓ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేస్తుండగా, స్పైక్ ఏరోస్పేస్ ఓ విండోలెస్ సూపర్‌సోనిక్ జెట్‌ను తయారు చేస్తోంది.

విండోలెస్ ప్లేన్

అయితే, ఈ కాన్సెప్ట్‌లు ఉత్పత్తి దశకు చేరుకొని పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మరో పదేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది. అప్పటి వరకూ మీరు ఇలాంటి అనుభూతిని పొందాలంటే, వీలైనంతగా ముందుగా మీ విండో సీట్‌ను బుక్ చేసుకోవాల్సిందే.

Most Read Articles

English summary
UK based company has come up with a concept for commercial planes where windows would be replaced by full-length smart screens to show what's happening outside as the plane flies through the air. 
Story first published: Wednesday, October 29, 2014, 16:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X