చెక్కతో వెస్పా స్కూటర్‌ను తయారు చేసిన కళాకారుడు

ఈ ఫొటోల్లో మీరు చూస్తున్న కలర్‌ఫుల్ వెస్పా స్కూటర్ ఆషామాషీ స్కూటర్ కాదు. సాధారణంగా వెస్పా స్కూటర్‌ను మెటల్‌తో నిపుణులైన ఇంజనీర్లు తయారు చేస్తారు. కానీ మనం ఈ ఫొటోల్లో చూస్తున్న వెస్పా స్కూటర్‌‌ను చెక్కతో తయారు చేసింది. అయితే, దీన్ని తయారు చేసింది ఇంజనీర్లు కాదు, ఓ కార్పెంటర్.

అవును.. పోర్చుగల్‌లోని లౌసాడాకు చెందిన కార్లోస్ ఆల్బెర్టో అనే ఓ 43 ఏళ్ల కార్పెంటర్ ఈ అద్భుతమైన స్కూటర్‌ను తయారు చేశాడు. ఈ స్కూటర్ పేరు 'డానీలా'. ఈ స్కూటర్ కేవలం షోపీస్ మాత్రమే కాదు, రోడ్డుపై రయ్యిమని కూడా దూసుకుపోగలదు.

వృత్తిరీత్యా కార్పెంటర్ (చెక్క పని చేసేవారు) అయిన కార్లోస్‌కు ద్విచక్ర వాహనాలంటే మంచి ప్యాషన్ ఉండేది. కార్పెంటర్ వృత్తిలో ఈయన మంచి కళాకారుడు కూడా. కార్లోస్‌కు 2001లో చెక్కతో మోటార్‌సైకిళ్లను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అంతే, అలా పుట్టుకొచ్చిం ఈ 'ఉడెన్ వెస్పా డానీలా స్కూటర్'.

మరి ఉడెన్ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని, దీన్ని తయారు చేసిన విధానాన్ని క్రింది ఫొటోలలో పరిశీలిద్దాం రండి.

కూతురి కోసం..

కూతురి కోసం..

కార్లోస్ ఆల్బెర్టో చెక్కతో తయారు చేసి ఈ స్కూటర్‌కు డానీలా అనే పేరును పెట్టాడు. ఇది ఆల్బెర్టో కుమార్తె పేరు, ఆమె పేరును ఈ స్కూటర్‍‌కు పెట్టారు. అంతేకాదు, ఆల్బెర్టో ఈ చెక్క స్కూటర్‌ను కేవలం ఆమె (డానీలా) కోసమే తయారు చేశాడు.

చెక్కతో వెస్పా స్కూటర్‌

వెస్పా క్లబ్ ఫ్రెముండెకు చెందిన ఓ స్నేహితుడి ప్రోద్భలంతో ఆల్బెర్టో ఈ చెక్క వెస్పా స్కూటర్ తయారీకి శ్రీకారం చుట్టాడు.

చెక్కతో వెస్పా స్కూటర్‌

ఆల్బెర్టో ఈ చెక్క వెస్పా స్కూటర్ తయారీని 2004లో ప్రారంభించాడు. అయితే, అప్పట్లో ఆయనకు ఓ సీరియస్ యాక్సిడెంట్ జరగటంతో దీని తయారీకి బ్రేక్ పడింది. అతను తిరిగి కోలుకున్న తర్వాత, 2007 మధ్య భాగంలో ఈ ప్రాజెక్టుకును మళ్లీ ప్రారంభించాడు.

చెక్కతో వెస్పా స్కూటర్‌

చివరికి జులై 12, 2008లో ఆల్బెర్టో తన చెక్క స్కూటర్ తయారీని పూర్తి చేశాడు. దీని తయారీలో ఆయన భార్య, కుమార్తె కూడా తమ వంతు సాయం చేశారు.

చెక్కతో వెస్పా స్కూటర్‌

మీరు బాగా గమనించినట్లయితే, ఈ చెక్క స్కూటర్‌పై విభిన్న రకాల ఉడ్ షేడ్స్‌ను గమనించవచ్చు. ఇందుకు ప్రధాన కారణం, ఈ చెక్క స్కూటర్ తయారీలో విభిన్న రకాల చెక్కను ఒకదానితో ఒకటి గ్లూ సాయంతో కలిపి అంటించి, ఈ ఫినిషింగ్ వచ్చేలా చేశారు.

చెక్కతో వెస్పా స్కూటర్‌

రోస్ ఉడ్, ఎబోనీ, బీచ్, సాటిన్ ఉడ్, జటోబా, టాకులా, ఎఫి జెలియా, పంగా, సుకుపిరా, సైకామోర్ అనే విభిన్న రకాల ఉడ్ (చెక్క)ను ఉపయోగించి ఈ చెక్క వెస్పా డానీల్ స్కూటర్‌ను తయారు చేశారు.

చెక్కతో వెస్పా స్కూటర్‌

ఈ చెక్క వెస్పా స్కూటర్ మోనోకాక్ ఛాస్సిస్‌ను డిజైన్ చేయటంలో పలు సవాళ్లను ఎదుర్కున్నట్లు ఆల్బెర్టో తెలిపారు. అలాగే, ఇందుకు ఖచ్చితంగా సెట్ అయ్యే ఒరిజినల్ వెస్పా స్కూటర్ ఇంజన్‌ను కనుగొనటంలో కూడా ఇబ్బంది పడినట్లు ఆయన చెప్పారు. అలాగే, స్కూటర్ హ్యాండిల్‌బార్, యాక్ససరీస్, రియర్ వీల్స్, మరికొన్ని భాగాలను క్రాఫ్ట్ చేయటంలో కూడా సవాళ్లు ఉన్నట్లు ఆల్బెర్టో చెప్పారు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

* ఇంజన్: సింగిల్ సిలిండర్, 2-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, 123.67 సీసీ

* గరిష్ట పవర్: 5 హెచ్‌పి @ 4850 ఆర్‌పిఎమ్

* ట్రాన్సిమిషన్: డైరెక్ట్ ట్రాన్సిమిన్, 3-స్పీడ్

ఫ్రేమ్ అండ్ సస్పెన్షన్

ఫ్రేమ్ అండ్ సస్పెన్షన్

* టేబుల్ మోనోకాక్ సెల్ఫ్-సపోర్టింగ్ ఉడెన్ ఫ్రేమ్

* మోనో హైడ్రాలిక్ ఫ్రంట్ సస్పెన్షన్

* 144మి.మీ. ట్రావెల్ మోనో షాక్ అబ్జార్వర్

బ్రేక్స్ అండ్ టైర్స్

బ్రేక్స్ అండ్ టైర్స్

* ఫ్రంట్ బ్రేక్ - 126మి.మీ. డ్రమ్ బ్రేక్

* రియర్ బ్రేక్ - 126మి.మీ. డ్రమ్ బ్రేక్

* ఫ్రంట్ టైర్ - 3.50 x 8"

* రియర్ టైర్ - 3.50 x 8"

కొలతలు

కొలతలు

* దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం - 5 లీటర్లు

* దీని మొత్తం బరువు - 107 కేజీలు

* సీట్ ఎత్తు - 760 మి.మీ.

* వీల్‌‌బేస్ - 1170 మి.మీ

* పొడవు 1715 మి.మీ.

* గరిష్ట వేగం - గంటకు 75 కి.మీ.

చెక్కతో వెస్పా స్కూటర్‌

తాను తయారు చేసిన చెక్క వెస్పా స్కూటర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపి చూపిస్తున్న కార్పెంటర్ కార్లోస్ ఆల్బెర్టో.

చెక్కతో వెస్పా స్కూటర్‌

చెక్క స్కూటర్‌లో ప్రధాన భాగమైన ఫ్రేమ్ తయారీ.

చెక్కతో వెస్పా స్కూటర్‌

చెక్క స్కూటర్ కోసం విడి భాగాల తయారీ.

చెక్కతో వెస్పా స్కూటర్‌

పూర్తిగా తయారైన అందమైన ఉడెన్ వెస్పా స్కూటర్ డాలీనా.

Most Read Articles

English summary
Carlos Alberto, a 43 year old carpenter residing in Lousada, Portugal is also passionate about two wheelers. One fine day in 2001 he hit upon the idea of employing his talent with woodcraft to build motorcycles. After facing some initial hurdles, which included convincing people to take his idea seriously Alberto managed to first all-wooden bike. The images you see in the gallery below are of the beautiful wooden incarnation of a classic Vespa, crafted by Carlos Alberto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X