గిన్నిస్ బుక్ ఎక్కిన ప్రపంచంలో కెల్లా అతిపెద్ద బైక్, అతిచిన్న కార్

By Ravi

గిన్నిస్ బుక్ ప్రపంచంలో మరెక్కడా లేని, మరెవరు చేయని వింతలను గుర్తిస్తుంటుంది. తాజాగా, 2014 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లోనే అనేక కొత్త అంశాలతో కూడిన రికార్డులు నమోదయ్యాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్ మరియు ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు గురించి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద బైక్
ఇటలీకి చెందిన ప్రోడక్ట్ డిజైన్ ఫ్యాబియో రెగ్గియాని రూపొందించిన కస్టమైజ్డ్ క్రూయిజర్ ఇది. ఈ మోన్‌స్టర్ బైక్‌ను తయారు చేయటానికి రెగ్గియాగో మరియు అతని బృందానికి సుమారు 7-8 నెలల సమయం పట్టిందట. ఈ బైక్‌ షో పీస్ మాదిరిగా కాకుండా, రోడ్డుపై నడుస్తుంది. ఇందులో 280 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. దీనికి 3 ఫార్వార్డ్ గేర్స్, 1 రివర్స్ గేర్‌లు ఉంటాయి. ఈ బైక్ ఫొటో, వీడియోలను క్రింది స్లైడ్‌లలో వీక్షించండి.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న కార్
టెక్సాస్‌కు చెందిన ఆస్టిన్ కౌల్‌‌సన్ వృత్తిరీత్యా కార్లను కస్టమైజ్ చేసే వ్యక్తి. అతని బుర్రలో పుట్టిన ఓ సరదా ఆలోచనే ఈ బుజ్జి కారు. పనికిరాని విడిభాగాలను సేకరించి ఈ బుజ్జి కారును సృష్టించాడు. ఇది కూడా షో పీస్ కాదండోయ్, రోడ్ లీగల్ కారు. అంటే చట్టరీత్యా ఈ కారును రోడ్డుపై తిప్పుకోవచ్చు. ఇందుకోసం ఆమోదిత సేఫ్టీ గ్లాస్‌తో తయారు చేసిన విండ్‌షీల్డ్, వైపర్స్, ఇండికేటర్స్, హెడ్‌లైట్స్, సీట్ బెల్ట్స్, హారన్ తదితర అంశాలను జోడించారు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది స్లైడ్‌లలో వీక్షించండి.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద బైక్, అతిచిన్న కార్

ఈ బైక్ మొత్తం 16 అడుగుల 8.76 ఇంచ్‌ల ఎత్తును, 394.88 ఇంచ్‌ల పొడవు, 98 ఇంచ్‌ల ఎత్తును కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువురు సుమారు సగం టన్ను ఉంటుంది.

ఇదివరకు ఈ గిన్నిస్ రికార్డును కలిగి ఉన్న మోన్‌స్టర్ సైకిల్ 11 అడుగులు 3 ఇంచ్‌ల ఎత్తును. 243.6 ఇంచ్‌ల పొడవును కలిగి ఉండేది. అయితే, ఆ బైక్‌లో 8.2 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద బైక్, అతిచిన్న కార్

ఇక అతిచిన్న కారు విషయానికి వస్తే, ఇది కేవలం 25 ఇంచ్‌ల ఎత్తును, 2 అడుగుల 1.75 ఇంచ్‌ల వెడల్పును మరియు 4 అడుగుల 1.75 ఇంచ్‌ల పొడవును కలిగి ఉంటుంది.

తాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కోసం ఏదో కొత్తగా ఆటోమోటివ్ విభాగంలో తయారు చేయాలని అనుకే వాడినని, అందుకే ఈ బుజ్జి కారును తయారు చేశానని కౌల్‌సన్ చెప్పుకొచ్చాడు.

Most Read Articles

English summary
Guinness has come out with the 2014 edition of its world records book. Among the thousand of strange and fascinating records mentioned in the book are these two. One is the world's largest functional motorcycle and the other is the world's smallest road legal car.
Story first published: Friday, September 13, 2013, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X