సముద్రం మీద ప్రపంచపు అత్యంత పొడవైన వంతెనను నిర్మించిన చైనా

ప్రపంచపు అత్యంత ఎత్తైన వంతెన చైనాలో ఉంది. ఇప్పుడు ప్రపంచపు అత్యంత పొడవైన సముద్రపు వంతెనను చైనా నిర్మించింది. సుమారుగా 50 కిలోమీటర్లు పొడవున్న ఈ వంతెన గురించి మరిన్ని వివరాలు...

Written By:

దశల వారీగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న 50 కిలోమీటర్ల పొడవున్న వంతెనకు హాంగ్‌కాంగ్-జుహాయ్-మకావ్ అనే పేరును పెట్టింది. చైనా త్వరలో దీనిని ప్రారంభించనుంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా సముద్రం మీద నిర్మించిన వంతెనలలో కెల్లా అత్యంత పొడవైనదిగా ఇది నిలవనుంది.

మూడు నగరాల మధ్య కారు ప్రయాణ సమయం నాలుగు గంటల నుండి 45 నిమిషాలకు తగ్గిపోయింది. హాంగ్‌కాంగ్-జుహాయ్-మకావ్ సముద్ర వంతనెను ఏడాది చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది.

హింగ్ కాంగ్ నుండి మకావ్ మరియు జుహాయ్ నగరాలను కలిపే ఈ వంతెనను పర్ల్ రివర్ డెల్టా మీద చైనా నిర్మించింది. సముద్రం తలం మీద ఇంత పెద్ద పొడవైన వంతెనను నిర్మించిన దేశంగా చైనా నిలిచింది.

చైనా ప్రాంతంలో అనుసంధానాన్ని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా చేసుకుని దీనిని నిర్మించింది. ప్రపంచ నిర్మాణ రంగంలో ఇదొక అద్బుతమని చెప్పాలి.

ఈ వంతెనకు మధ్యలో రెండు కృత్రిమ ద్వీపాలున్నాయి. ఈ రెండింటి మధ్య పెద్ద పెద్ద నౌకలు వంతెనను దాటేందుకు సొరంగమార్గాన్ని కూడా నిర్మించారు. ఇది వంతెన మీద వాహన రాకపోకలకు మరియు సముద్రం మీద నౌకల రాకపోకలకు ఉపయోగపడుతుంది.

ఆంగ్లపు వై-ఆకారంలో ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని 2009లో చైనా ప్రారంభించింది. దీని పూర్తి నిర్మాణం కోసం సుమారుగా 100 బిలియన్ యువాన్ల(15బిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం)ను ఖర్చు చేసింది.

ఈ వంతెన నిర్మాణం కోసం అనవసరమైన ఖర్చులు భారీగా చేశారనే విమర్శలు ఉన్నట్లు టెలిగ్రాఫ్ ఓ కథనంలో తెలిపింది. అయితే ఈ వంతెన ప్రారంభమైన తొలి 20 ఏళ్లలో 3.5బిలియన్ బ్రిటిష్ పౌండ్ల ఆదాయం తీసుకొస్తుందని అధికారులు తెలిపారు.

పర్ల్ రివర్ డెల్టా మీదుగా ఈ వంతెన ఉండటం ద్వారా తక్కువ ధరలతో తయారయ్యే ఉత్పత్తులను పశ్చిమ దేశాల వినియోగదారుల కోసం ఎగుమతులు కూడా పెరగనున్నాయి.

ప్రపంచపు అత్యంత ఎత్తైన వంతెన చైనాలో ఉంది. ఇప్పుడు ప్రపంచపు అత్యంత పొడవైన సముద్రపు వంతెనను చైనా నిర్మించింది.

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu World's Longest Sea Bridge Built China
Please Wait while comments are loading...

Latest Photos