ఎగిసిపడుతున్న టాప్ 11 ఎలక్ట్రిక్ కార్లు

By Vinay

డీజల్, పెట్రోల్ కార్లు ఒకప్పటి మాట. ఈ ఆధునిక యుగానికి తగినట్టు ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వీటికి మనం సెల్‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌కు చార్జింగ్ చేసినట్లు విద్యుత్తుకు కనెక్ట్ చేస్తే సరిపోతుంది.

ఈ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడానికి చిన్న తయారీ సంస్థలే కాదు పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థలు పోటి పడుతున్నాయి. ఎటువంటి ఇంధనం లేకుండా అవి కొన్ని కిలోమీటర్లు దూసుకుపోతాయి.

ఇలా ప్రస్తుతం దూసుకుపోతున్న టాప్ 11 ఎలక్ట్రిక్ కార్లు, వాటి గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.........

1. నిసాన్ లీఫ్ :

1. నిసాన్ లీఫ్ :

ఎలక్ట్రిక్ కార్లలో ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అమ్ముడవుతున్నది నిసాన్ లీఫ్. 200,000 యూనిట్ల అమ్మకాలను పూర్తీ చేసింది. దీని లోపలి భాగాలు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ చేసి తయారుచేయబడ్డాయి. ఇది 170 కి.మీ దూరం వెళ్లగలదు.

2. మెర్సెడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ :

2. మెర్సెడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ :

ఇది 552 కి.వా పవర్‌తో 100కి.మీ/హవర్ వేగాన్ని కేవలం 3.9సెకండ్లలో అందుకోగలదు. దీన్ని ఫార్ములా 1 ఎక్స్‌పర్ట్స్ తీర్చిదిద్దారు.

3. మహీంద్రా ఈ20 :

3. మహీంద్రా ఈ20 :

ఇది ఇండియాలోనే మొదటి ఎలక్టిక్ కార్. ఇది రెండు డోర్లు కలిగిన 4-సీటర్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్, మొబైల్ ఆప్ కంట్రోల్డ్ ఏసీ వంచటి ఫీచర్స్‌తో తయారైంది.

4. బీఎమ్‌డబ్ల్యూ ఐ3 :

4. బీఎమ్‌డబ్ల్యూ ఐ3 :

ఇది 160 కిలోమీటర్ల వరకు వెళ్లగలుగుతుంది. ఇది 0-100 కి.మీ/హవర్ వేగాన్ని 7.2 సెకండ్లలో అందుకోగలదు.

5. కియా సౌల్ ఈవీ :

5. కియా సౌల్ ఈవీ :

ఇది 0-100 కి.మీ/హవర్ వేగాన్ని 12 సెకండ్లలో అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ 145 కి.మీ/హవర్.

6. ఫియట్ 500ఈ :

6. ఫియట్ 500ఈ :

ఇది కాలిఫోర్నియా, ఒరెగాన్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. ఇది బేసిక్ మోడల్ అయిన ఫియట్ 500 ఎలెట్రా నుంచి అభివృద్ధి చేయబడింది.

7. ఫోక్స్‌వ్యాగన్ ఈ-అప్ :

7. ఫోక్స్‌వ్యాగన్ ఈ-అప్ :

ఇది 150 కిలోమీటర్ల వరకు వెళ్లగలుగుతుంది. ఇది నగరాలకు సరిపడే విధంగా డిజైన్ చేయబడింది.

8. ఫోక్స్‌వ్యాగన్ ఈ-గోల్ఫ్ :

8. ఫోక్స్‌వ్యాగన్ ఈ-గోల్ఫ్ :

ఇది 161 కిలోమీటర్ల వరకు వెళ్లగలుగుతుంది.

ఇందులో క్రింది రెండు వెర్షన్‌లు ఉన్నాయి :

  • లిమిటెడ్ ఎడిషన్.
  • లగ్జరియస్ ఎస్ఈఎల్ ప్రీమియం.
  • 9. టెస్లా మోడల్ ఎస్ :

    9. టెస్లా మోడల్ ఎస్ :

    ఇది 5-డోర్ లగ్జరీ లిఫ్ట్‌బ్యాక్. ఇది 500 కిలోమీటర్ల వరకు వెళ్లగలుగుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కి.మీ/హవర్.

    10. ఫోర్డ్ ఫోకస్ ఎలక్ట్రిక్ :

    10. ఫోర్డ్ ఫోకస్ ఎలక్ట్రిక్ :

    ఇది 122 కిలోమీటర్ల వరకు వెళ్లగలుగుతుంది. బ్యాటరీ, చార్జర్ మరియు ఆన్ బోర్డ్ ఎలక్ట్రానిక్స్ లోడ్ స్పేస్‌ను తగ్గిస్తాయి.

    11. టెస్లా మోడల్ ఎక్స్ :

    11. టెస్లా మోడల్ ఎక్స్ :

    ఇది 2016 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది 7-సీటర్ ఎస్వీయు. ధర, స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కాలేదు.

Most Read Articles

English summary
Here is a story about World top eleven electric cars.
Story first published: Thursday, July 2, 2015, 11:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X