ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు

By N Kumar

ఆధునిక ప్రపంచంలో మానవ అభివృద్ది ఎంత జరుగుతోందో మానవ వినాశనం కూడా అలాగే వృద్ది చెందుతోంది. దీనికి కారణం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులే ఇందుకు నిదర్శనం. చావు వరకు వెళ్లిన వారిని కూడా ప్రాణాలతో బ్రతికించే టెక్నాలజీలను అభివృద్ది చేసుకున్న మానవ జాతి. ఒకరిని ఒకరు వెంటాడి చంపునునే కృూరత్వాన్ని కూడా అలవరుచుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు రకరకాల యుద్ద వాహనాలను, సైనికల బలగాన్ని రోజు రోజుకీ పెంచుకుంటున్నాయి. అయితే ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిణామం సంభవిస్తోంది ప్రపంచ అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతోంది.

అందుకోసమే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన యుద్ద వాహనాలను మరియు సైనిక బలాన్ని కలిగి కొన్ని దేశాల గురించి ఇవ్వడం జరిగింది ఇందులో భారత్ ఏ స్థానంలో ఉందో చూద్దాం రండి.

10. టర్కీ

10. టర్కీ

టర్కీ దేశం తమ బలాన్ని అత్యంత శక్తివంతైన యుద్ద వాహనాల రూపంలో కలిగి ఉంది. అంతే కాదు ఇది టర్కీ కొన్ని భయంకరమైన యుద్ద వాహనాలను సృష్టించేందుకు భారత్ మరియు చైనాలతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే టర్కీ ప్రస్తుతం 410,500 మంది సైనికులను, 3,778 యుద్ద ట్యాంకులు, 1,020 విహంగ యుద్ద విమానాలు మరియు 13 సబ్‌మెరైన్‌లను కలిగి ఉంది.

 09. జపాన్

09. జపాన్

టర్కీ తరువాత స్థానంలో ఉంది జపాన్. జపాన్ చూడటానికి ఎంతో చిన్నగా ఉంటుంది కాని వారు వారి దేస ప్రజల భద్రతకు పెద్ద పీట వేశారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం జపాన్ 247,173 మంది సైనికులను, 678 యుద్ద ట్యాంకులు, 1613 యుద్ద విమానాలు మరియు 16 సబ్‌మెరైన్ లను కలిగి ఉంది.

08. జర్మనీ

08. జర్మనీ

జర్మనీ దేశం సైనిక బలంగం కన్నా ఆయుధ బలగం ఎక్కువగా ఉంది. అవును జర్మనీ ఆయుధాలను ఎక్కువగా సమకూర్చుకుంది. ఇందులో అత్యాధునిక యుద్ద విమానాలను ఎక్కువ సంఖ్యలో కలగి ఉంది. ప్రస్తుతం జర్మనీ మిలటరీలో 179,046 మంది సైనికులు, 408 యుద్ద ట్యాంకులు, 663 యుద్ద విమానాలు మరియు నాలుగు సబ్‌మెరైన్‌లను కలిగి ఉంది.

07. సౌత్ కొరియా

07. సౌత్ కొరియా

సౌత్ కొరియాకు ఉన్న ఏకైక శత్రు దేశం నార్త్ కొరియా. సౌత్ కొరియా దేశం ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారుచేసుకోవడంలో వెనకబడి ఉన్నప్పట్టికీ తీర ప్రాంత బలంలో ఫ్రాన్స్ మరియు యుకెల కన్నా ఇదే శక్తివంతమైనది. ప్రస్తుతం సౌత్ కొరియా 624,465 మంది సైనికులను, 2,381 యుద్ద ట్యాంకులను, 1,412 యుద్ద విమానలను మరియు 13 సబ్‌మెరైన్‌లను కలగి ఉంది.

06. ఫ్రాన్స్

06. ఫ్రాన్స్

గత సంవత్సరం చివరిలో ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడితో ఒక్క సారిగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. దేశం చిన్నగా ఉన్నప్పటికీ భద్రత కోసం వీరు విడుదల చేసిన బడ్జెట్ బ్రిటీ,్ ప్రభుత్వం రక్షణ కోసం విడుదల చేసిన బడ్జెట్‌కు సమానంగా ఉంది. ప్రస్తుత ఫ్రాన్స్ వద్ద 202,761 మంది సైనికులు, 423 యుద్ద ట్యాంకులు, 1,264 సాయుధ విమానాలు మరియు 10 విమానాలు వీటితో పాటు ఎయిర్ క్రాఫ్ట్‌లను మోసుకెల్లే నాలుగు వాహనాలు కలవు

05. యుకె ( యునైడ్ కింగ్‌డమ్)

05. యుకె ( యునైడ్ కింగ్‌డమ్)

యుకే దేశం వారి ప్రజల భద్రత కోసం రక్షణ రంగం మీద దాదాపుగా 10బిలియన్ అమెరికన్ డాలర్లుగా బడ్జెట్ ప్రకటించారు. ఇది భారతదేశ ప్రభుత్వం ప్రకటించినదాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రస్తుతం యుకె 146,980 మంది సైనిక బలాన్ని, 936 యుద్ద విమానాలను, 407 యుద్ద ట్యాంకులను మరియు 10 సబ్‌మెరైన్‌‌లను కలిగి ఉంది.

04. భారత దేశం

04. భారత దేశం

భారతదేశం కలిగి ఉన్న సైనిక బలం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ స్థానంలో కలదు. ప్రస్తుతం భారత్ ఉత్తమ సైనిక బలాన్ని కలిగి ఉంది మరియు ఇప్పుడిప్పుడే ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. భారతీయ రక్షణం రంగంలో దాదాపుగా 1,325,000 మంది సైనికులు, 6,464 యుద్ద ట్యాంకులు, 1,905 యుద్ద విమానాలు, 15 జలాంతర్గామిలను మరియు రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లను మోసుకెల్లే వాటిని కలిగి ఉంది.

03. చైనా

03. చైనా

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా జనాభాను కలిగిన దేశం చైనా. ప్రస్తుతం చైనాకు అత్యంత శక్తివంతమైన సైనిక బలగాన్ని కలిగి ఉంది. వీరి రక్షణ రంగంలో దాదాపుగా 2,333,000 మంది సైనికులు, 9,150 యుద్ద ట్యాంకులు, 2,860 యుద్ద విమానాలు, 67 జలాంతర్గాములు ఉన్నాయి.

02. రష్యా

02. రష్యా

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన దేశాలలో రెండవ స్థానంలో ఉన్న రష్యా వద్ద అత్యధికంగా యుద్ద ట్యాంకులు ఉన్నాయి. వీటితో పాటు రష్యా మిలిటరీలో దాదాపుగా 766,055 మంది సైనికులు, 15,398 యుద్ద ట్యాంకులు, 3,429 యుద్ద విమానాలు మరియు 55 సబ్‌మెరైన్‌లు కలవు.

 01. అమెరికా

01. అమెరికా

మొదటి స్థానంలో ఎవరు ఉంటారు అని అనుకున్నారు....? అమెరికానే కదా. కొన్ని సంసవత్సరాల కాలంగా అత్యంత శక్తివంతైన మిలిటరీ బలాన్ని కలగి ఉన్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం అమెరికా వద్ద 1,40,000 మంది సైనికులు, 8,848 యుద్ద ట్యాంకులు, 13,892 యుద్ద విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్‌లను మోసుకెల్లే వాహనాలు 20 మరియు 72 జలాంతర్గామిలను కలగి ఉంది. అంతే కాకుండా అమెరికా తమ దేశ రక్షణ రంగం కోసం 600 బిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు
  1. భారతీయుల గుండె ధైర్యం...! దేశీయ శౌర్య క్షిపణి

  2. తీర ప్రాంతాలను ఆక్రమించిన అమెరికా యుద్ద ట్యాంకులు
  3. భారతీయ సైన్యం వద్ద గల యుద్ద వాహన సామర్థ్యం

Most Read Articles

English summary
Worlds 10 Most Powerful Militariess
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X