ఫ్రాన్స్‌లో ప్రపంచపు మొట్టమొదటి సౌర ఫలక రహదారి ప్రారంభం

Written By:

రోడ్డు మీద అందమైన గాజు ఫలకలను పరిస్తే ఎలా వెళ్లాలి అనుకుంటున్నారా...? ఇవి అందమైన గాజు ఫలకలే. అయితే సాధారణ గాజు ఫలకలు కాదు. సూర్యరశ్మిని బంధించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న వీటిని ఆధునిక పరిభాషలో సోలార్ ప్యానెళ్లు అంటారు.

మేడ మీద, విద్యుత్ స్తంభాలకు, కాంపౌండ్ వాల్స్ మరియు ఇంటి ముందుండే వసరాల మీద వీటిని ఏర్పాటు చేయడం చూసుంటాం. కాని ఫ్రాన్స్ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా రహదారి మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది.

ప్రపంచపు మొట్ట మొదటి సోలార్ రహదారి మీద 2,800 చదరపు మీటర్ల మేర సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీద రోజుకు సుమారుగా 2,000 లకు పైబడి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

ఫ్రాన్స్ లోని నర్మండి రాష్ట్రంలో గల Tourouvre-au-Perche అనే గ్రామంలో ఒక కిలోమీటర్ పొడవు మేర సోలార్ రహదారిని ఏర్పాటు చేశారు. ఈ ఒక కిలో మీటర్ పొడవున్న ప్రపంచపు ఫస్ట్ ఎవర్ సోలార్ రోడ్డును వాట్ట్‌వే అని పిలుస్తారు.

2,800 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉన్న విద్యుత్ ఉత్పాదక సోలార్ ప్యానెళ్ల రహదారి ఏర్పాటుకు మన ఇండియన్ కరెన్సీలో అయితే సుమారుగా రూ. 35.43 కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. ఈ రహదారిని ఫ్రెంచ్ పర్యావరణ శాఖ మంత్రి సెగోలెనె రాయల్ ప్రారంభించారు.

ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేసిన ఈ సోలార్ రహదారిని సుమారుగా 2,000 కు పైగా వాహనదారులు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఫ్రాన్స్ పర్యావరణ శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.

3,400 నివాసాలు గల గ్రామంలోని మొత్తం వీధి దీపాలకు సరిపడే విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని పరీక్షించిన అనంతరం ఈ సోలార్ ప్యానెళ్ల రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది.

ఫ్రాన్స్ లోని నార్మ్యాండి రాష్ట్రంలో ఎండలకు పెట్టింది పేరు. మరి ఒక గ్రామంలో ఏర్పాటు చేసిన ఇలాంటి రహదారిని ఆ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు.

గ్రామానికి ఒకటి చెప్పున ఇలాంటి రోడ్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఆ రాష్ట్రం విద్యుత్‌ కొరతకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన రహదారి మీద వాహనాల రద్దీ వీలైనంత తక్కువగా ఉంటే సూర్య కిరణాలు ఎక్కువగా సోలార్ ఫలకల మీద ప్రసరించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

భారత దేశం ఇప్పటితే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని విరివిగ పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ఈ విన్నూత్న ఆలోచనను అందిపుచ్చుకుని దేశీయంగా మారుమూల పల్లెల్లో ఇలాంటి రహదారులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అయితే ఈ ఆలోచనను అందిపుచ్చుకుంటుందో లేదో అనే దాని కోసం వేచి చూడాలి మరి.

మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.... తెలుగు డ్రైవ్‌స్పార్క్ (telugu.drivespark.com)

భారత దేశపు తొలి సోలార్ రైలు
భారత దేశపు మొదటి సోలార్ రైలుకు శ్రీకారం చుట్టింది ఇండియన్ రైల్వే. దీనికి గురించి పూర్తి వివరాల కోసం...

అక్కడ ఆదివారాల్లో కార్లను కడగడం కూడా నేరమే...!! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వింత నియామాలు
రవాణాలో భద్రతారిత్యా ప్రమాదాలను అరికట్టడానికి ఎన్నో రకాల నియమాలు అమలులో ఉంటాయి. వాటిని పాటించని వారికి అదే స్థాయిలో శిక్షలు, జరిమానాలు (ఫైన్) వంటివి ఉంటాయి. ఇవి మనందిరికీ బాగానే సుపరిచితం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని భయంకరమైన నియమాలు అమలులో ఉన్నాయి.

 

English summary
Worlds First Solar Panel Road Opens In France
Please Wait while comments are loading...

Latest Photos