ప్రపంచపు అత్యంత ఎత్తైన రైలు వంతెనను నిర్మిస్తున్న భారత్

Written By:

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనను ఏది అంటే... ఇక మీదట తడబటాయించటం మానేయండి. ఎందుకంటే ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనను నిర్మిస్తోంది. జమ్మూ అండ్ కాశ్మీరులోని చీనాబ్ నది మీద దీనిని నిర్మిస్తోంది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ వంతెన ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైనదిగా మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా నిలవడానికి దోహదపడే దీని ప్రత్యేక అంశాలేంటో నేటి కథనంలో చూద్దాం రండి.

సింగల్ లైన్‌తో ఉన్న వంతెనను ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ నది మీద నిర్మిస్తున్నారు.

వేసవి మరియు శీతాకాల సభలకు రెండు రాజధానులను కలిగి ఉన్న జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న జమ్మూ జిల్లాలోని కత్రా మరియు శ్రీనగర్ జిల్లాలోని కౌరి ప్రాంతాలను ఈ వంతెన కలపనుంది.

2019 నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ వంతెన చీనాబ్ నదిలోని నీటి ఉపరితలం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉండనుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎత్తైన రైలు వంతెనగా ఇది నిలవనుంది.

2019 నాటికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా ఇది నిలిస్తే, మరి ప్రస్తుత్తం ఉన్న ఎత్తైన వంతెన ఏది అనుకుంటున్నారా... చైనాలోని షౌబియా రైల్వే బ్రిడ్జి 275 మీటర్ల ఎత్తులో ఉండి మొదటి స్థానంలో నిలిచింది.

ఈ వంతెన మరో రికార్డును కూడా నెలకొల్పనుంది. అత్యంత ఎత్తైన టవర్‌గా ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను చెప్పుకుంటాం... అయితే చీనాబ్ నది మీద నిర్మిస్తున్న వంతెన ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎక్కువ ఎత్తు కలిగి ఉంది.

2019లో పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలకు సిద్దం అవుతున్న ఈ చారిత్రాత్మక వంతెన నిర్మాణానికి 24,000 టన్నుల ఇనుమును వినియోగిస్తున్నారు.

1.3-కిలోమీటర్ల పొడవున్న ఈ అత్యంత ఎత్తైన రైలు వంతెనను 1,110 కోట్ల రుపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

హిమాలయాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు కాబట్టి, భవిష్యత్తులో టెర్రరిస్టులు దీనిని కూల్చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి దీనిని 63ఎమ్ఎమ్ మందం ఉన్న బ్లాస్ట్ ప్రూఫ్‌ స్టీల్‌తో నిర్మిస్తున్నారు.

వంతెనను ధృడంగా నిలిపేది పిల్లర్లు. కాబట్టి కాంక్రీటుతో నిర్మిస్తున్న పిల్లర్లు బాంబు దాడులను సైతం ఎదుర్కొని స్థిరంగా ఉండేలా నిర్మాణం చేపడుతున్నారు.

ఇక ఎండ మరియు వర్షానికి వంతెన మీద ఉన్న స్టీల్ తుప్పుపట్టకుండా ఉండేందుకు ప్రత్యేకించి యాంటి కరోషన్ పెయింట్ ఉపయోగించనున్నారు. ఈ పెయింట్ ఒక్క సారి చేస్తే 15 ఏళ్ల వరకు ఇనుము తుప్పుపట్టడాన్ని నిరోధిస్తుంది.

అన్ని రకాల ఉష్ణోగ్రతల వద్ద వాతావరణ మార్పుల కారణంగా వంతెన నిర్మాణానికి వినియోగించిన స్టీల్‌లో ఎలాంటి మార్పులు జరగవు. మరియు అత్యంత ఎత్తులో నిర్మించిన ఈ వంతెన గాలి ద్వారా కలిగే ఒత్తిడిని తట్టుకుంటుంది.

వంతెనను మరియు రైళ్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏరియల్ సెక్యూరిటీ సేఫ్ గార్డ్‌ను ప్రభుత్వం ఈ వంతెన మీద అమర్చనుంది. ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా వంతెన యొక్క సేప్టీ అంశాలను సూచిస్తూ ఉంటుంది.

గంటకు 250కిలోమీటర్ల వేగంతో గాలి వీచినప్పటికీ ఈ వంతెన స్థిరంగా ఉంటుంది. మరియు ఈ చీనాబ్ రైలు వంతెన మీద రైళ్లు గరిష్టంగా గంటకు 90కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

నిర్మాణ దశలో ఉన్న చీనాబ్ రైల్వే వంతెన వివరాలను ఇక్కడున్న వీడియా ద్వారా వీక్షించగలరు....
Picture credit: AFCONS 

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, May 8, 2017, 14:01 [IST]
English summary
Read In Telugu All You Need To Know About The World's Highest Railway Bridge
Please Wait while comments are loading...

Latest Photos