ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు ప్రయాణాలు

Written By:

ఎటువంటి దూరభార ప్రాంతాల ప్రయాణాలకైనా ఎంతో అనువైన ప్రయాణ సాధనం రైలు, దేశీయంగా ఎన్నో ప్రాంతాలను కలుపుతూ అత్యంత దూరం ప్రయాణించే రైళ్లు ఉన్న విషయం తెలిసిందే. కాని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దూరం ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నాయి. అందులో కొన్నింటి క్రింది కథనంలో చూద్దాం రండి.

14. ఇస్బాని: అలెక్సాండ్రియా - అస్వాన్ (ఈజిప్ట్)

 • ప్రయాణ దూరం: 683 మైళ్లు (1,100 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమం: 17 గంటలు 
 • ప్రయాణ ధర సుమారు: 128 డాలర్లు

అన్ని రకాల వయస్కుల వారికి ఎన్నో సౌకర్యాలతో ఈ ఈజిప్ట్ రైలు ప్రయాణం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. నైలు నది వెంబడి సాగే ఈ ప్రయాణం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. 

Picutre credit: enr.gov.eg

13.అబర్‌డీన్ - పెన్‌జాన్స్ (ఇంగ్లాండ్)

 • ప్రయాణ దూరం: 785 మైళ్లు (1263 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 17 గంటలు 
 • ప్రయాణ ధర సుమారు: 325 డాలర్లు

ఈ రైలు మొత్తం ప్రయాణ దూరంలో 100 కు పైగా స్టేషన్లను దాటుకొని ప్రయాణిస్తుంది, వివిధ దేశాలలో ప్రయాణించే రైలు యుకె ఒక చివరి నుండి మరో చివర వరకు ప్రయాణిస్తుంది.

12. స్టాక్‌హామ్ (స్వీడెన్) నుండి నార్విక్ (నార్వే)

 • ప్రయాణ దూరం: 910 మైళ్లు (1464 కిలోమీటర్లు) 
 • ప్రయాణ సమయం: 18:30 గంటలు

11. ఒసాకా - సప్పొరొ ( జపాన్)

 • ప్రయాణ దూరం: 937 మైళ్లు ( 1507 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 22 గంటలు

10. బ్లూ ట్రైన్: ప్రిటోరియా - కేప్‌ టౌన్ (సౌతాఫ్రికా)

 • ప్రయాణ దూరం: 994 మైళ్లు ( 1600 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 27 గంటలు 
 • ప్రయాణ ధర సుమారుగా: 1162 డాలర్లు

బ్లూ ట్రైన్‌లో ప్రయాణ ఎంతో లగ్జరీ సౌకర్యా మధ్య ఉంటుంది. ఇందులో వంటకాలకు పెట్టింది పేరు. ఈ ప్రయాణంలో బట్లర్స్, క్యూబన్ సిగర్స్ మరియు గౌర్మెట్ డిన్నర్లు అందుబాటులో ఉంటాయి.

09.ఈస్ట్రన్ అండ్ ఓరియంటల్ ఎక్స్‌ప్రెస్

 • ప్రయాణ మార్గాలు: బ్యాంకాక్ (థాయిలాండ్) నుండి సింగపూర్
 • ప్రయాణ దూరం: 1,355 మైళ్లు ( 2,181 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: మూడు రోజులు/ రెండు రాత్రులు లేదా నాలుగు రోజులు/ మూడు రాత్రులు
 • ప్రయాణ ధర సుమారుగా: 2,266 డాలర్లు

ఈ రైలు 1932 లో వచ్చిన ఎపోనిమస్ సినిమా ప్రేరణతో కవాయ్ మరియు పెనాంగ్ వంతెన మీద కాసేపు ఆపి తరువాత ప్రయాణాన్ని కొనసాగిస్తారు.
Picture credit: belmond

08. ఘాన్: డార్విన్ నుండి అడిలియడ్ (ఆస్ట్రేలియా)

 • ప్రయాణ దూరం: 1,851 మైళ్లు (2,979 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 47 గంటలు
 • ప్రయాణ ధర సుమారుగా: 943 డాలర్లు

ఘాన్ రైలులో ఆస్ట్రేలియా అత్యధిక దూరం మేర ఉన్న నిర్జన ప్రదేశం ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణంలో ప్రపంచపు అతి పెద్ద ఏకశిల ఇసుక రాయిని ఉలూరు అనే ప్రాంతంలో చూడవచ్చు.
Picture credit: Jeanie Mackinder/Wiki Commons

07. ప్యారిస్ మోస్కో ఎక్స్‌ప్రెస్

 • ప్రయాణ దూరం: 1,998 మైళ్లు (3,125 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: రెండు రోజులు 
 • ప్రయాణ ధర సుమారు: 943 డాలర్లు

ఈ రైలు ప్రయాణంలో రెండు గొప్ప దేశాల రాజధాని నగరాలను కలవవచ్చు. ఫ్రాన్స్ లోని ప్యారిస్ నుండి రష్యా లోని మాస్కో ల మధ్య ప్రయాణించే ఇందులో ప్రముఖ నగరాలైన బ్రస్సెల్స్, కోలోగ్ని, బెర్లిన్, వార్సా మరియు మిన్‌స్క్ వంటి వాటిని సందర్శించవచ్చు.
Picture credit: trains-worldexpresses

06. వివేక్ ఎక్స్‌ప్రెస్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దూరం ప్రయాణించే రైళ్ల జాబితాలో ఉన్న వివేక్ ఎక్స్‌ప్రెస్ మన దేశంలోని అస్సాంలో ఉన్న డిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది.

 • ప్రయాణ దూరం: 2633 మైళ్లు (4,237 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 82 గంటలు 
 • ప్రయాణ ధర సుమారుగా: 94 డాలర్లు

Picture credit: irfca

 

 

05. ఎమిరివిల్లే - చికాగో

 • ప్రయాణ దూరం: 2,438 మైళ్లు (3,924 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 51 గంటలు 
 • ప్రయాణ ధర సుమారుగా: 944 డాలర్లు

అమెరికాలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలలో ఇది ఎంతో ముఖ్యమైనది. ఈ రెండు ప్రాంతాల మధ్య డెన్వర్, సాల్ట్ లేక్ సిటి, రినో మరియు శాక్రామెంటో అనే ప్రముఖ ప్రేదేశాలుంటాయి.
Picture credit: Kabelleger/Wiki Commons

04. ఇండియన్ పసిఫిక్

 • ప్రయాణ మార్గం: సిడ్నీ నుండి పెర్త్ (ఆస్ట్రేలియా)
 • ప్రయాణ దూరం: 2,704 మైళ్లు ( 4,352 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 65 గంటలు
 • ప్రయాణ ధర సుమారుగా: 2,904 డాలర్లు

ఇండియన్ పసిఫిక్ అనే పేరుతో నడిచే ఈ రైలు గోస్ట్ నగరం నుండి పురాతణ బంగారు గనుల మీదుగా ప్రయాణిస్తూ ఆస్ట్రేలియా మైనింగ్ చరిత్రను చూపిస్తుంది ఈ రైలు.
Picture credit: Bahnfrend/Wiki Commons 

03. షాంఘై - ల్షాసా (చైనా)

 • ప్రయాణ దూరం: 2,717 మైళ్లు ( 4,373 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: 47 గంటల 40 నిమిషాలు 
 • ప్రయాణ ధర సుమారు: 192 డాలర్లు

చైనాలోని మాజెస్టిక్ ఫార్మల్ ఇంపీరియల్ క్యాపిటల్ ఎక్స్‌ఐ నుండి టిబెటిన్ పర్వాతాల మీదుగా దీని ప్రయాణ సాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎత్తైన ట్రైన్‌ లైన్ (5,072 మీటర్లు ఎత్తు) గుండా ప్రయాణిస్తుంది.
Picture credit: Jucember/Wiki Commons

02. ది కెనేడియన్: టొరంటో - వాంకోవర్ (కెనడా)

 • ప్రయాణ దూరం: 2,775 మైళ్లు (4,466 కిలోమీటర్లు)
 • ప్రయాణ సమయం: మూడు రోజులు 
 • ప్రయాణ ధర సుమారుగా: 2,250 డాలర్లు

ఈ రైలు ప్రయాణం ద్వారా మంచుతో కప్పబడి ఉండే రాతి కొండలు, కెనడాలోని అటవీ ప్రాంతాలను మరియు అనంతమైన వన్యప్రాణులను చూస్తూ ప్రయాణించవచ్చు. Picture credit: David Wilson/Wiki Commons

01. ట్రాన్స్-సైబీరియన్

ప్రయాణ మార్గం: మాస్కో- వ్లాడివోస్టక్ (రష్యా)
ప్రయాణ దూరం: 8,753 మైళ్లు (9,259 కిలోమీటర్లు)
ప్రయాణ సమయం: ఆరు రోజులు
ప్రయాణ ధర సుమారుగా: 14,518 డాలర్లు

ఈ రైలు ప్రయాణం ద్వారా వివధ ప్రాంతాలకు చెందిన టైమింగ్ జోన్‌లలోకి వెళుతుంటాం. అత్భుతమైన ఉరల్ పర్వతాలు మరియు ప్రపంచలోనే అతి పెద్ద మంచి నీటి కొలను మీదగా ప్రయాణం సాగిపోతుంది.
Picture credit: Kallgan/Wiki Commons

  

Read more on: #రైలు #rail
English summary
Worlds Longest Train Journeys
Please Wait while comments are loading...

Latest Photos