ర్యాష్ డ్రైవర్లు.. వారి పాపులర్ వాహనాలు..

By Ravi

ర్యాష్ డ్రైవర్ అనగానే మనకు వారు ఉపయోగించే కొన్ని రకాల వాహనాలు టక్కున గుర్తుకు వస్తుంటాయి. సిగ్నల్స్ బ్రేక్ చేయటం, ఓవర్‌స్పీడ్, లైన్ డిసిప్లేన్ లేకపోవటం, రోడ్డుపై సాటి డ్రైవర్లను గౌరవించకపోవటం, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ అనవసరంగా గొడవలకు దిగటం మొదలైన అలవాట్లు కలిగిన డ్రైవర్లను ర్యాష్ డ్రైవర్లు లేదా నిర్లక్ష్యపు డ్రైవర్లుగా చెప్పుకోవచ్చు.

ఉదారహణకు.. మనం కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో గమనించినట్లయితే ఆటోరిక్షాలు రోడ్డుపై ఇష్టం వచ్చినట్లుగా వెళ్తుంటాయి. కొందరు డ్రైవర్లయితే సిగ్నల్ ఇవ్వకుండా రైట్ లేదా లెఫ్ట్‌కో ఆటోని తిప్పేయటం ఏదైనా జరగరానిది జరిగితే నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం (అందరు ఆటో డ్రైవర్లు అలా ఉండరు లెండి) చేస్తుంటారు.

ర్యాష్ డ్రైవర్లంటే కేవలం ఆటోలే కాదు మరికొన్ని వాహనాలు కూడా గుర్తుకువస్తాయి.. అవేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

టాటా ఇండికా

టాటా ఇండికా

టాటా ఇండికా కార్లను వ్యక్తిగత ప్రయోజనం కన్నా టాక్సీ ఉపయోగార్థమే ఎక్కువగా వాడుతుంటారు. అవగాహన లేని డ్రైవర్లు కూడా క్యాబ్ డ్యూటీలలో చేరి సమాజానికి చేటుగా పరిణమిస్తుంటారు. నిరక్షరాస్యులైన డ్రైవర్లు నిబంధనలకు నీళ్లొదిలి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ కనిపిస్తారు. ఇండికా వంటి కార్లను ర్యాష్‌గా నడుపుతుంటారనే వాదనలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

ఆటోరిక్షా

ఆటోరిక్షా

ఆటోరిక్షాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో సొట్టలు (డెంట్స్) లేని ఆటోరిక్షాలను చేతివేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వీరిపై మీ అభిప్రాయం ఏంటి?

టాటా సుమో

టాటా సుమో

తెలుగు సినిమాల్లో అయితే టాటా సుమోలను కేవలం పేల్చడానికి లేదా ఛేజింగ్ సీన్‌ల కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ రియల్ వరల్డ్‌లో చూస్తే ఈ వాహనాలను ఎక్కువగా ప్యాసింజర్ క్యారియర్లుగా ఉపయోగిస్తుంటారు. కొందరు డ్రైవర్లు వీటిని చాలా రఫ్‌గా డ్రైవర్ చేస్తుంటారు. అందుకే యాక్సిడెంట్ జరిగిన వాహనాల్లో మనకు ఎక్కువగా సుమోవైరలు కనిపిస్తుంటాయి.

మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్

యువత ఎక్కువగా స్విఫ్ట్ కార్లను ఉపయోగిస్తుంటుంది. ఈ కార్లను తమకు నచ్చినట్లుగా మోడిఫై చేసుకొని, స్పోర్ట్స్ కార్లను నడుపుతున్నట్లుగా ఫీల్ అవుతుంటారు. మోడిఫైడ్ స్విఫ్ట్ కార్లను చూడగానే అందులోని డ్రైవర్ల తీరు మనకు ఇట్టే అర్థమైపోతుంటుంది (అందరూ కాదనుకోండి).

టొయోటా ఇన్నోవా

టొయోటా ఇన్నోవా

టొయోటా ఇన్నోవాను కూడా ఎక్కువగా టాక్సీ సెగ్మెంట్లో ఉపయోగించడాన్ని చూస్తుంటాం. హైవేపై ఈ వాహన వేగానికి హద్దే ఇండదు. పోరు కోసం రంకెలు వేస్తూ ముందు వచ్చే మహిషంలా వస్తుంటుంది ఇది. దీనిని నడిపేవారు కూడా అలాగే ఉంటారు.

స్కూటర్/మోటార్‌సైకిల్

స్కూటర్/మోటార్‌సైకిల్

కేవలం ఫోర్-వీలర్స్ విషయంలోనే కాదు టూవీలర్స్ విషయంలో కూడా ర్యాష్ రైడర్లు ఉంటారు. ముఖ్యంగా డియో, యమహా, పల్సర్ వంటి టూవీలర్స్‌ను ఉపయోగించే రైడర్లు సందు గొందులలో దూరుకుంటూ పోతుంటారు.

ట్యాంకర్స్/ట్రక్స్/టిప్పర్స్

ట్యాంకర్స్/ట్రక్స్/టిప్పర్స్

ఈ రకం వాహనాల ర్యాష్ డ్రైవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైవేల పొడగునా ఎక్కడో ఒకచోట ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు గురవుతూనే ఉంటాయి.

ట్రాక్టర్

ట్రాక్టర్

పల్లెల్లో ట్రాక్టర్ ర్యాష్ డ్రైవర్లను మనం ఎక్కువగా చూస్తుంటాం. ఫుల్లు లోడుతో ఉన్న ట్రాక్టర్లను నడిపేటప్పుడు ఉన్న జాగ్రత్త ఖాలీగా ఉండే ట్రాక్టర్లను నడిపేటప్పుడు ఉండదు. ట్రాక్టర్లను ఏదో ఫార్ములా వన్ కార్లను నడిపినట్లుగా నడిపేస్తుంటారు.

టొయోటా ఎతియోస్

టొయోటా ఎతియోస్

ఎతియోస్ కారును కూడా ఎక్కువగా క్యాబ్ కోసం ఉపయోగిస్తుంటారు. రాత్రివేళల్లో ఈ కారును నడిపే కొందరు డ్రైవర్లు ఖాలీగా ఉన్న రోడ్లను ఫార్ములా వన్ ట్రాక్‌లుగా భావించి పరుగులు తీస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు.

మోపెడ్స్

మోపెడ్స్

ఇవి చూడటానికి చిన్న వాహనాలే అయినా వీటిని నడిపే వారిలో కొందరు ఏదో సూపర్‌బైక్‌లను నడుపుతున్నట్లుగా రయ్ రయ్ మని దూసుకుపోతుంటారు.

చివరిమాట

చివరిమాట

గమనిక: నిత్యం రోడ్లపై మనం గమనించే వాహనాలు, ర్యాష్ డ్రైవర్ల తీరును ఆధారంగా చేసుకొని ఈ కథనం ప్రచురించడమైనది. అంతేకానీ ఇది ఎవ్వరినీ ఉద్దేశించి ప్రచురించినది కాదని మనవి.

సురక్షితంగా డ్రైవ్ చేయండి.. సంతోషంగా జీవించండి..

Most Read Articles

English summary
We list down a few vehicles which we personally feel belongs to the worst car drivers list. Does you car fall in this list? 
Story first published: Friday, March 20, 2015, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X