సాధారణ జీవన శైలి నుండి కోట్ల ఖరీదైన కారులో సవారీ: యోగి ఆదిత్యనాథ్‌

Written By:

భారత దేశపు శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ పేరు మొదట వినబడుతుంది. ఉత్తర ప్రదేశ్ సిఎంగా భాద్యతలు తీసుకున్న తరువాత అధికారుల గుండెల్లో నిద్రపోతున్నారనే కథనాలు పత్రికల్లో భారీగా కనిపిస్తోంది. యోగిగా సాధారణ జీవన శైలికి అలవాటుపడిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పుడు కోట్ల రుపాయల ఖరీదైన కారును పొందాడు.

భారత దేశపు శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ పేరు మొదట వినబడుతుంది. ఉత్తర ప్రదేశ్ సిఎంగా భాద్యతలు తీసుకున్న తరువాత అధికారుల గుండెల్లో నిద్రపోతున్నారనే కథనాలు పత్రికల్లో భారీగా కనిపిస్తున్నాయి. యోగిగా సాధారణ జీవన శైలికి అలవాటుపడిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పుడు కోట్ల రుపాయల ఖరీదైన కారును పొందాడు.

భారత్‌లోని అతి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ఒకటి. అఖిలేష్ యాదవ్ నుండి ముఖ్యమంత్రి భాద్యతలు తీసుకున్న భాజాపా నేత యోగి ఆధిత్యనాత్ శక్తివంతమైన భారత దేశపు ముఖ్యమంత్రుల్లో ఒకరు నిలిచి, ఆ రాష్ట్ర అధికారులకు ముచ్చెమటులు పట్టిస్తున్నాడు.

అధికారులను ఉరుకులు పెట్టిన యోగి ఆధిత్యన్యాత్ గారి మెర్సిడెస్ బెంజ్ ఎమ్-గార్డు కారు గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రముఖలు కోసం మరియు రాజకీయ నాయకుల కోసం మెర్సిడెస్ బెంజ్ అత్యంత భద్రత ప్రమాణాలతో ప్రత్యేకమైన కార్లు తయారు చేస్తోంది. మెర్సిడెస్ బెంజ్ వద్ద ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కార్ల జాబితాలో ఎమ్-గార్డ్ ఒకటి.

2014 లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిబడిన మెర్సిడెస్ బెంజ్ ఎమ్-గార్డ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.49 కోట్లుగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని రోడ్డెక్కితే దీని ధర రూ. 3 కోట్లుగా ఉంది.

కార్ల రెసిస్టెన్స్ లెవల్(ప్రతి ఘటన స్థాయి) పరంగా ఇచ్చే విలువలో ఈ కారు విఆర్4 రెసిస్టెన్స్ లెవల్ పొందింది. అంటే ఈ కారు మీద సాధారణ హ్యాండ్ గన్ నుండి 0.44ఎమ్ఎమ్ మ్యాగ్నమ్ గన్‌తో కాల్పులు జరిపినా కూడా ఏమీకాదు.

385 కిలోల బరువున్న మెర్సిడెస్ బెంజ్ ఎమ్-గార్డ్ కారులో ఎయిర్‌మ్యాటిక్ సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. ప్రమాదాల్లో డ్యామేజ్ కాకుండా శక్తివంతమైన వీల్ యాక్సిల్ కాంపోనెంట్లను అందివ్వడం జరిగింది.

బుల్లెట్లు లోపలి చొచ్చుకెల్లకుండా ఉండేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన అద్దాలను ఇందులో అందివ్వడం జరిగింది. తద్వారా ఇది సాధారణ ఎమ్-గార్డ్ కారు కన్నా మరింత బరువుగా ఉంటుంది.

ఇంజన్ విషయానికి వస్తే, శక్తివంతమైన యుపి సిఎం యోగి ఆధిత్యనాత్ గారు ఉపయోగించే ఈ ఎమ్-గార్డ్ కారులో 4.7-లీటర్ల సామర్థ్యం వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 402బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మెర్సిడెస్ బెంజ్ ఎమ్-గార్డ్ కారు కేవలం 6.5 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉంది.

అనతి కాలంలో ఈ కారును ఎలా పొందాడు ?

నిజానికి ఈ బుల్లెట్ ఫ్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ ఎమ్-గార్డ్ కారును పొందాలంటే డెలివరీ ఇవ్వడానికి సుమారుగా ఏడాది కాలం పడుతుంది. మరి మొన్న సిఎం అయ్యాడు అంత త్వరగా ఎలా పొందాడు అనే డౌట్ వస్తోందా....? గతంలో ఇదే కారును యుపి సిఎం గా ఉన్న అఖలిషే యాదవ్ వినియోగించే వాడు. అతని స్థానంలోకి యోగి ఆదిత్యనాథ్ వచ్చాక వెంటనే అఖేష్ నుండి తెప్పింకున్నాడు.

యోగి ఆదిత్యనాథ్ గతంలో వినియోగించిన కారు

యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్య మంత్రి కాక ముందు ఇండియా మెచ్చిన టయోటా ఇన్నోవా ఎమ్‌పీవీ వాహనాన్ని వివియోగించే వాడు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఈ మెర్సిడెస్ బెంజ్ ఎమ్-గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారును పొందాడు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, April 6, 2017, 17:00 [IST]
English summary
Read In Telugu To Know About UP CM Yogi Adityanath Bullet Proof Car. Get more details about uttarpradesh chief minister Yogi Adityanath's new car Mercedes Benz M-Gaurd.
Please Wait while comments are loading...

Latest Photos