ప్రపంచంలో కెల్లా అత్యంత యువ ఫెరారీ ఓనర్

పదేళ్ల వయస్సులో మన దగ్గర ఓ మంచి సైకిల్ కూడా ఉండి ఉండదు. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడ్డోడి దగ్గర కోట్లు ఖరీదు చేసే ఫెరారీ కారు ఉంది. బ్రిటన్‌కు ఈ చెందిన కల్లమ్ అనే ఈ బాలుడు 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పు ఓ అప్లికేషన్‌ను తయారు చేసి గూగుల్‌కు విక్రయించాడట. దాంతో గూగుల్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బును (సుమారు 8.5 మిలియన్లను (డాలర్ల లేక పౌండ్లా అనేది తెలియదు) ఈ బాలుడికి ఇచ్చిందట.

అందరిలాగే కల్లమ్ కూడా డబ్బుతో బొమ్మను కొనుక్కోవటానికి వెళ్లాడు. అయితే, కల్లమ్ కొనుక్కుంది మాములు బొమ్మ కాదు కోట్లు ఖరీదు చేసే ఫెరారీ కారుని. ఇది 2010 మాట. కల్లమ్‌కు ఇప్పుడు 12 ఏళ్లు. ఈ బాలుడి వద్ద ఇప్పుడు ఫెరారీ 458 ఇటాలియా, 599 జిటిఓ సూపర్ కార్లు కూడా ఉన్నాయి. ఈ రెండు కార్ల చేరితో కల్లమ్ ఫెరారీ కార్ల సంఖ్య మూడుకి పెరిగింది. దీంతో ప్రపంచంలో అత్యంత కుర్ర ఫెరారీ ఓనర్‌గా కల్లమ్ పేరు మారు మ్రోగిపోతుంది.

ఎఫ్‌గేర్.టివి అనే మీడియా కల్లమ్‌ను ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది (క్రింది స్లైడ్‌లలో వీక్షించవచ్చు). అయితే, ఇదంతా బూటకం అని కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు. అసలు ఆ బాలుడు తయారు చేసిన అప్లికేషన్ ఏంటో తెలియకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. కొందరు ఇదంతా నిజం కాదని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఇత చిన్న వయస్సులో కోట్స ఖరీదు చేసే కార్లను కలిగి ఉండటమంటే పెట్టి పుట్టుండాలి. మీరేమంటారు..?

ప్రపంచంలో కెల్లా అత్యంత యువ ఫెరారీ ఓనర్

పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు కల్లమ్‌తో ఇంటర్వ్యూ

వీడియో

ప్రపంచంలో కెల్లా అత్యంత యువ ఫెరారీ ఓనర్

12 ఏళ్ల వయస్సప్పుడు కల్లమ్‌తో ఇంటర్వ్యూ

వీడియో

Most Read Articles

English summary
A 10 year boy named Callum, who sounds like he is from the UK, created an application which he later sold to Google. The tech giant paid the kid a generous amount of 8.5 million (not clear if that's in dollars or pounds). The 10 year then went on to spend the money like any other kid. He bought a toy. Only, his choice of toy was a Ferrari supercar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X