మోటార్ వాహన చట్టాలు - జరిమానాలు: రెండవ భాగం

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012, 18:29 [IST]
మనం హైదరాబాద్‌లో రోజు ప్రయాణించే బస్సులను గమనించినట్లయితే, బస్సులో ప్రయాణించే వారి సంఖ్య కన్నా బస్సు ఫుట్‌బోర్డులో ప్రయాణించే వారి సంఖ్యే అధికంగా ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదేమో. అలా ప్రయాణించడం తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా కొందరు అదే తీరును కనబరుస్తుంటారు. మరి ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తే జరిమానా విధించాలన్న విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కొందరూ చూసి చూడనట్లు ఊరుకుంటారు.

* ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తే - (మో.వా.చ. సెక్షన్ 123 (ii)) - ఆర్‌టిసి మొబైల్ కోర్టుకు లేదా ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువెళ్తారు. రూ.50 నుండి రూ.200 వరకూ జరిమానా కూడా విధిస్తారు.

* శారీరకంగా, మానసకింగా సరిలేని వారు వాహనం నడిపితే - (మో.వా.చ. సెక్షన్ 186) - రూ.200 పెనాల్టీ.

* యాక్సిడెంట్ చేసి పారిపోతే - (మో.వా.చ. సెక్షన్ 187) - కోర్టుకు తీసుకువెళ్లబడతారు.

* అసురక్షితమైన వాహనాన్ని ఉపయోగించడం/డ్రైవ్ చేయటం - (మో.వా.చ. సెక్షన్ 190 (i)) - కోర్టుకు తీసుకువెళ్లబడతారు.

* పాడుబడిన వాహనాలను ఉపయోగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే - (హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం 41 (i)) - ద్విచక్ర/త్రిచక్ర వాహనాలకు ట్రాఫిక్ క్రేన్ లిఫ్టింగ్ ఛార్జీలు రూ.150, నాలుగు చక్ర వాహనాలకు రూ.200, ఆరు చక్రాల వాహనాలకు రూ.300-600 వరకూ వసూలు చేయబడుతాయి.

* హెల్మెట్ హెచ్చరికకు సంబంధించి - (మో.వా.చ. సెక్షన్ 129/177) - రూ.100 పెనాల్టీ.

* అధిక లోడ్‌తో వాహనాన్ని డ్రైవ్ చేయటం (వాణిజ్య వాహనాలకు) - (మో.వా.చ. సెక్షన్ 194) - ప్రతి టన్నుకు ఆర్టీఏ ద్వారా రూ.1,000 వసూలు చేయటం లేదా కోర్టుకు తీసుకువెళ్లటం.

* అనుమతి లేకుండా వాహనాన్ని తీసుకువెళ్లటం - (మో.వా.చ. సెక్షన్ 197) - పర్మిట్ కండిషన్‌ (చెక్ రిపోర్ట్)పై ఆర్టీవో చర్యలు తీసుకుంటుంది.

* మోటార్ వాహనానికి సంబంధించి అనధికారిక జోక్యం - (మో.వా.చ. సెక్షన్ 198) - ఆర్టీఏ ద్వారా రూ.100 పెనాల్టీ.

* వాహనం నడపటానికి అనధికారిక వ్యక్తికి అనుమతి ఇవ్వటం - (మో.వా.చ. సెక్షన్ 180) - ద్విచక్ర / త్రిచక్ర / నాలుగు చక్ర వాహనాలకు రూ.500 పెనాల్టీ. ఆరు చక్రాల వాహనాలకు రూ.1,000 పెనాల్టీ.

Content Source: Hyderabad Traffic Police (HTP)
English summary
Various traffic violations attract different fines or penalties. Here is a comprehensive list of fines to be paid for any traffic violation. Do not pay bribes, pay fine.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .