సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ బుకింగ్స్ 15,000 యూనిట్స్

By Ravi

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం సుజుకి మోటార్‌సైకిల్ గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి 110సీసీ స్కూటర్ 'సుజుకి లెట్స్' (Suzuki Let's)కు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఈ మోడల్‌కు దేశవ్యాప్తంగా సుమారు 15,000 యూనిట్లకు బుకింగ్‌‍లు వచ్చాయి.

సుజుకి లెట్స్ స్కూటర్‌ను ప్రత్యేకించి నేటి యువతను (18-25 ఏళ్ల వయస్సు కలిగిన వారిని) లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఆకర్షనీయమైన స్టయిలిష్ డిజైన్, బెటర్ పెర్ఫార్మెన్స్, బెటర్ మైలేజ్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి ఇదే తొలి 110సీసీ స్కూటర్. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా డియోతో నేరుగా పోటీపడనుంది.


సుజుకి లెట్స్ స్కూటర్‌లో 112.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.0 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ స్కూటర్‌ లీటరు పెట్రోలుకు గరిష్టంగా 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్‌కు లోబడి).

సుజుకి లెట్స్ స్కూటర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది.

Suzuki Lets Scooter

సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను అలాగే వెనుక వైపు స్వింగ్ఆర్మ్ టైప్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. రాష్ట్ర మార్కెట్లో దీని ధర రూ.45,748 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) ఉంది.
Most Read Articles

English summary
The Suzuki Let's will go up against the likes of Yamaha Ray and Honda's Activa i. Suzuki have reported that the Let's scooter has received positive feedback from buyers and roughly 15,000 booking have been made across the nation.
Story first published: Saturday, June 21, 2014, 18:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X