బైక్‌ల కోసం మెట్రో టైర్స్ నుండి ట్యూబ్‌లెస్ టైర్లు

సైకిళ్ల (బైస్కిల్స్) టైర్ల తయారీలో 1968వ సంత్సరం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూన్న, నాణ్యతలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాధించుకున్న "మెట్రో టైర్స్" ఇప్పుడు మోటార్‌సైకిళ్ల కోసం కూడా టైర్లను తయారు చేయడం మొదలు పెట్టింది. ద్విచక్ర వాహనాల కోసం ట్యూబ్‌లెస్ టైర్ల (గాలి ట్యూబ్ లేని టైర్లు)ను తయారు చేసేందుకు గాను ప్రముఖ టైర్ల తయారీ సంస్థ 'కాంటినెంటల్'తో మెట్రో టైర్స్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ప్రస్తుతం మెట్రో టైర్స్ కొన్ని రకాల మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల మోడళ్లకు టైర్లు అందిస్తున్నప్పటికీ, ఈ తరహా ట్యూబ్‌లెస్ టైర్లను తయారు చేయడం మాత్రమే ఇదే మొదటిసారి. ఈ ఒప్పందంలో భాగంగా, మోటార్‌సైకిళ్ల కోసం తయారు చేసే ట్యూబ్‌లెస్ టైర్ల డిజైన్, అభివృద్ధికి గానూ మెట్రో టైర్స్‌కు కావాల్సిన సాంకేతి మద్ధతును జర్మనీకు చెందిన కాంటినెంటల్ ఏజి అందిస్తుంది.

ఇప్పుడు దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల్లో ఈ తరహా ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగిస్తున్నారు. ఇవి సాధారణ టైర్ల కన్నా మెరుగైనవే కాకుండా, గ్రామీణ రోడ్లపై సైతం చక్కగా పనిచేయడం, పంక్చర్లను తట్టుకోవటం వంటి విశిష్టమైన సదుపాయాల కారణంగా వీటికి డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది.

Most Read Articles

English summary
Country's one of the oldest bicycle tyres manufacturer Metro tyres now enter into the agreement with the German's tyre maker Continental for making tubeless tyres for motorcycles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X