ఎయిర్‌లెస్ టైర్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన బ్రిడ్జ్‌స్టోన్

Airless Tyre
వాహనం తయారీలో కీలకమైనవి టైర్లు. ఇంజన్‌ ఎంత సమర్థవంతంగా ఉన్నప్పటికీ టైర్లు సక్రమంగా లేకుంటే వాహనం ముందుకు సాగదు. ఇంత ప్రాముఖ్యత కలిగి ఈ టైర్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి ఎన్నో రకాలుగా రూపాంతరం చెందించడం జరిగింది. ట్యూబ్‌లెస్ టైర్లు, పంక్చర్ ఫ్రీ టైర్లు, నేచర్ ఫ్రెండ్లీ టైర్లు, రేడియల్ టైర్లు ఇలా ఎన్నో అధునాతన టైర్లు నేడు లభ్యమవుతున్నాయి.

ప్రస్తుతం లభ్యమవుతున్న టైర్లన్నింటికీ నిర్ధిష్టమై వాయు పీడనం (ఎయిర్ ప్రెజర్) ఉంటేనే ముందుగు సాగుతాయి లేకపోతే సాగవు. అయితే, సమీప భవిష్యత్తులో అసలే గాలే అవసరం లేని టైర్లు రాబోతున్నాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ "నాన్-న్యుమాటిక్ టైర్" కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. సాధారణ టైర్ల మాదిరిగా ఈ టైర్లకు గాలి (ఎయిర్) అవసరం లేదు.

అంటే, ఇవి ఎయిర్‌లెస్ టైర్లు అన్నమాట. అంతేకాదండోయ్.. ఈ టైర్లు పంక్చర్లు కావు, పగిలిపోవు, అధిక వేగంతో వెళ్తున్నప్పటికీ ఇవి బరస్ట్ కాకుండా ఉండి ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఈ టైర్లు సురక్షితమైనవే కాకుండా ప్రకృతి సాన్నిహిత్యమైనవి కూడా. ఈ టైర్లలో ఎయిర్ కంపార్ట్‌మెంట్‌కు బదులు స్పోక్స్ వంటి నిర్మాణం ఉంటుంది. ఈ టైర్లను 100 శాతం రీసైకిల్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
The Japanese tyre major Bridgestone has developed a new type of tyres that do not require air to be filled in them. Named as 'non-pneumatic tyre' concept, these tyres are puncture proof and do not burst in even very high speeds. These tyres are also eco friendly as they are completely recyclable.
Story first published: Saturday, December 10, 2011, 17:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X