Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఆస్టన్ మార్టిన్ వన్-77 లిమిటెడ్ ఎడిషన్ సైకిల్

Posted by:
Published: Saturday, July 7, 2012, 11:56 [IST]

ఈ ఫోటోలో ఉన్న సైకిల్‌ను గమనించారా..? దీని ఖరీదు కేవలం రూ.20 లక్షలు మాత్రమే. ఇంత ఖరీదు చేయటానికి ఇందులో అంత విషయం ఏముందనుకుంటున్నారా..? దీని పేరు ఆస్టన్ మార్టిన్ వన్-77 సైకిల్. అయితే, దీనిని తయారు చేసింది ఆస్టన్ మార్టిన్ కంపెనీ మాత్రం కాదు. ప్రీమియం సైకిళ్లను తయారు చేసే బ్రిటన్‌కు చెందిన ఫ్యాక్టర్ బైక్స్ అనే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ సైకిల్‌ను డిజైన్ చేసింది.

ఆస్టన్ మార్టిన్ నుంచి లభిస్తున్న అత్యంత ఖరీదైన లిమిటెడ్ ఎడిషన్ వన్-77 కారు పేరును ఈ సైకిల్‌కు పెట్టడం జరిగింది. ఆస్టన్ మార్టిన్ లోగో, బ్రాండింగ్‌ను ఈ సైకిల్‌పై చూడొచ్చు. స్పోర్ట్స్ కారును నుంచి స్ఫూర్తి పొంది ఈ సైకిల్‌ను డిజైన్ చేశారు. ఫార్మూలా 1 విడిభాగాలను ఉపయోగించి ఆస్టన్ మార్టిన్ వన్-77 సైకిల్‌ను రూపొందించారు. ఆస్టన్ మార్టిన్ వన్-77 కారు మాదిరిగా ఈ సైకిళ్లు కూడా కేవలం 77 యూనిట్లను మాత్రమే తయారు చేశారు.


ఆస్టన్ మార్టిన్ వన్-77 కారు ధర మన మార్కెట్లో సుమారు రూ.22 కోట్ల వరకూ ఉండగా, ఆస్టన్ మార్టిన్ వన్-77 సైకిల్ ధర సుమారు రూ.20 లక్షలకు (38,843 డాలర్లు) పైగా ఉంటుంది. ఈ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్యాక్టర్ బైక్స్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆస్టన్ మార్టిన్ వన్-77 సైకిల్‌ను రూపొందించారు.

సైకిల్ బరువును తగ్గించేందుకు గానూ దీని లైట్‌వెయిట్ కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో డిజైన్ చేశారు. ప్రతి సైకిల్‌ను కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీ మోడిఫై చేసి ఇస్తుంది. ఇది ఏడు ఆకర్షనీయమైన రంగుల్లో (బ్లూ పెరల్, విల్లా డెస్టే బ్లూ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్ పెరల్, స్పిరిట్ గ్రే, కార్బన్ బ్లాక్, బ్రాంజ్ పెరల్, కాపర్ ఫైర్) లభిస్తుంది. హైడ్రాలిక్ బ్రేక్స్, గేర్స్, డిజిటల్ మీటర్ కన్సోల్, లైట్‌వెయిట్ కార్బన్ ఫైబర్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో ఇది లభ్యమవుతుంది.

English summary
The Aston Martin One-77 Cycle is the world's most technologically advanced road bicycle. Designed, engineered and built in Britain, the One-77 Cycle features technology and innovations derived from racing car technology, together with the highest levels of fabrication and craftsmanship.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu