Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

శ్రీమన్నారాయణలో యమహా బైక్ రైడ్ చేసిన బాలకృష్ణ

Posted by:
Updated: Saturday, August 25, 2012, 13:07 [IST]

ఇటీవల అల్లు అర్జున్ , ఇలియానాలు హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'జులాయి' చిత్రంలో ఈ జంట ఓ యమహా ఎఫ్‌జెడ్‌పై షికార్లు కొట్టిన సంగతి తెలిసిందే. జులాయి సినిమాలో ఈ సన్నివేశం ఆద్యంతం హాస్యభరితంగా సాగిపోతుంది.

కాగా ఇప్పుడు తాజాగా.. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' అనే చిత్రంలో హీరో బాలకృష్ణ కూడా ఇదే తరహా బైక్‌పై కనిపించనున్నారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న శ్రీమన్నారాయణ వర్కింగ్ స్టిల్‌ను చూడండి.. మన బాలయ్య బాబు ఎంత స్టయిల్‌గా కనిపిస్తున్నాడో. లెథర్ జాకెట్, స్పోర్ట్స్ షూస్ ధరించి ఏదో రేస్‌కు వెళ్తున్న రేసర్‌లా కనిపించడం లేదు.

ఇటీవలి కాలంలో సినిమాలను గమనిస్తే.. హీరోలంతా ఎక్కువగా యమహా బైక్‌లనే ప్రిఫర్ చేయటం జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం వీటిని రైడ్ చేయటం చాలా సులువు. ఇవి మంచి హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటాయి. పవర్‌ఫుల్ ఇంజన్, మెరుగైన పికప్‌ కలిగి ఉండే యమహా బైక్‌లను ఇష్టపడని బైక్ ప్రియులంటూ ఉండరు. జపనీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లభిస్తున్న యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మరి ఈ బైక్‌కు ఇంత మంచి క్రేజ్ ఉండటానికి కారణం ఎంటో తెలుసుకుందామా..?

స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌లకు యమహా ఎఫ్‌జెడ్-ఎస్ పెట్టింది పేరు. యూరోపియన్ ఇంటర్నేషనల్ డిజైన్, సరికొత్త కలర్స్, బాడీ గ్రాఫిక్స్, ఏరోడైనమిక్స్, స్టయిలిష్ అండ్ స్పోర్టీ కార్బన్ పాటర్న్ మీటర్ కన్సోల్, ఆకర్షనీయమైన హెడ్‌ల్యాంప్‌తో ఇది మాచో లుక్‌ను కలిగి ఉంటుంది. ఫ్యాషనబల్, స్టయిలిష్ రైడ్ కోరుకునే యువత కోసం ఎఫ్‌జెడ్-ఎస్ 'లార్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్' అనే ట్యాగ్‌లైన్‌తో లభించే ఈ స్పోర్ట్స్ బైక్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఫీచర్లు:
* పవర్‌ఫుల్ ఇంజన్: యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌ బైక్‌లో సరికొత్త 153సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, 2-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 14 పిఎస్‌ల గరిష్ట పవర్‌ను, 13.6 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

* మోనోక్రాస్ సస్పెన్షన్: యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌ బైక్‌ మోనోక్రాస్ సస్పెన్షన్ (వెనుక వైపు ఉండే సింగిల్ సెంటర్ షాక్ అబ్జార్వర్)తో లభిస్తుంది. ఈ మోనోక్రాస్ రియర్ సస్పెన్షన్ యూనిట్ 120 మి.మీ. వీల్ ట్రావెల్‌ను అందిస్తుంది. ఇది రన్నింగ్ పెర్ఫామెన్స్‌ పెంచడంలోనూ అలాగే మంచి హ్యాండ్లింగ్‌ను అందించడంలో సహకరిస్తుంది. ఇది రైడర్‌కు అలాగే వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుడికి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

* మిడ్‌షిప్ మఫ్లర్ (సైలెన్సర్): ఇందులో ఉపయోగించిన సరికొత్త సైలెన్సర్ మంచి స్టయిలిష్ డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా, ఎగ్జాస్ట్ సామర్థ్యాన్ని పెంచడంలోను అలాగే మంచి మాస్ బీటింగ్‌ను అందించడంలో తోడ్పడుతుంది.

* వెడల్పాటి వెనుక టైరు: ఈ బైక్‌కు వెనుక వైపు వెడల్పాటి రేడియల్ కలిగిన టైరును అమర్చటం జరిగింది. 140/60-R17 సైజ్ కలిగిన ఈ టైరు భారతదేశంలోనే మొట్టమొదటి. ఇది మంచి రోడ్ గ్రిప్‌ను కలిగి ఉండి, బైక్ స్కిడ్ కావటం జరగదు అలాగే, మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను కూడా అందిస్తుంది. చిన్న చిన్న పంక్చర్ల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

* కొత్త స్టయిలిష్ గ్రాఫిక్స్: యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఉండే గ్రాఫిక్స్ బైక్‌కు సూపర్ స్టయిలిష్ లుక్‌ని ఇస్తాయి. అంతేకాకుండా, ఈ గ్రాఫిక్స్ బైక్‌కు మంచి స్పోర్టీ లుక్‌నిస్తుంది. ఈ బైక్‌పై వెళ్తుంటే, ఇది రోడ్డుపై వెళ్లేవారి దృష్టిని మీ వైపుకు తిప్పుకోవటం ఖాయం.

* సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్: ఈ బైక్ స్టయిలిష్ లుక్‌ను కలిగి ఉండటానికి ప్రధానం కారణంగా దీని ఫ్యూయెల్ ట్యాంక్. 12 లీటర్ల సామర్థ్యం కలిగి పెద్ద స్టీల్ ఫ్యూయెల్ ట్యాంక్ ఈ బైక్‌కు ప్రధాన ఆకర్షనగా నిలుస్తుంది.

* ట్రెండీ మీటర్ కన్సోల్: యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌లో సెంటర్ కన్సోల్ (డిజిటల్ స్పీడో మీటర్) కూడా మరొక ప్రధాన ఆకర్షనగా చెప్పుకోవచ్చు. ఫుల్ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే కలిగిన ఈ డిజిటల్ మీటర్ విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్‌తో ఇతర ఇండికేటర్లను కలిగి ఉంటుంది.

* ఫెండర్ అండ్ సీట్: యమహా ఎఫ్‌జెడ్-ఎస్ విశాలమైన రియర్ ఫెండర్‌ను కలిగి ఉండి, తడి రోడ్లపై ప్రయాణించేటప్పుడు బురద, నీటి తుంపరల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇక దీని పొడవాటి, వెడల్పాటి సీట్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది. దీని వెనుక వైపు అమర్చిన గ్రాబ్ బార్ వెనుక వైపు కూర్చునే ప్రయాణికులకు బ్యాక్‌రెస్ట్‌గా మాత్రమే కాకుండా, గతుకుల రోడ్లలో వెనుక కూర్చునే ప్రయాణికులు గ్రిప్ కోసం చేతితో పట్టుకునే హ్యాండిల్‌ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

Story first published:  Saturday, August 25, 2012, 12:42 [IST]
English summary
Tollywood actor Balakrishna rides Yamaha FZ-S sports bike in his upcoming film Srimannarayana. FZ-S highlights the style quotient and has more flesh to flaunt with purely European international design like new colours & graphics, aerodynamic chiseled windshield, stylish & sporty carbon pattern meter console, and more aggressive looking headlight. The new FZ-S is for stylish and attention seeking Macho man.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu