Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

టాటా వెంచర్ ఎమ్‌పివి కోసం ఉచిత సర్వీస్ క్యాంప్

Posted by:
Published: Friday, May 25, 2012, 12:32 [IST]

Free Service Camp Tata Venture Owners

మీ దగ్గర టాటా వెంచర్ ఉందా.. అయితే, ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. టాటా మోటార్స్ అందిస్తున్న మల్టీ యుటిలిటీ వెహికల్ 'టాటా వెంచర్' కోసం కంపెనీ ఓ ఉచిత సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. ఈ టాటా వెంచర్ సర్వీస్ క్యాంప్ మే 24, 2012 నుండి మే 26, 2012 వరకూ జరుగుతుంది. ఇందులో భాగంగా, టాటా వెంచర్ వాహనాలను ఉచితంగా చెకప్ చేయటమే కాకుండా, విడిభాగాలు, లేబర్ ఛార్జీలపై కూడా కంపెనీ తగ్గింపులను అందిస్తుంది.

టాటా మోటార్స్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 281 అధీకృత డీలర్వ ద్వారా ఈ సర్వీస్ క్యాంప్‌ను కంపెనీ అందిస్తోంది. వాహనాలకు విక్రయించిన తర్వాత వినియోగదారులకు మెరుగైన సేవలు అందిచాలనే ఉద్దేశ్యంతో ఈ టాటా వెంచర్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించామని, ఈ సర్వీస్ క్యాంప్ కేవలం తమ కస్టమర్లకు వాహనాలకు అవసరమైన సర్వీసింగ్ సేవలను అందించడమే కాకుండా, వారి నుండి సేకరించే ఫీడ్‌బ్యాక్‌లను ఆధారంగా చేసుకొని మరింత మెరుగైన ఉత్పత్తులను అందించడానికి తమకు అవకాశం ఏర్పడుతుందని టాటా మోటార్స్ యుటిలిటి వెహికల్ ప్రోడక్ట్ హెడ్ అశేష్ ధార్ తెలిపారు.

ఈ సర్వీస్ క్యాంప్‌కు వచ్చే టాటా వెంచర్ వాహనాలను ఉచితంగా తనిఖీ చేయడమే కాకుండా, లేబర్ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు, స్పేర్ట్ పార్ట్‌లపై 5 శాతం తగ్గింపులను టాటా మోటార్స్ అందిస్తుంది. మెయింటినెన్స్ టిప్స్, ఇంటీరియర్ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ల గురించి కూడా కస్టమర్లకు సర్వీస్ క్యాంప్ సిబ్బంది వివరించటం జరుగుతుంది. ఇక టాటా వెంచర్ విషయానికి వస్తే.. ఇది 5 సీటర్, 7 సీటర్, 8 సీటర్ ఆప్షన్లతో, ఐదు ఆకర్షనీయమై రంగులలో, మూడు వేరియంట్లలో లభిస్తుంది.

టాటా వెంచర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.53 లక్షలుగా ఉంది. ఇందులో ఉపయోగించిన 1.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 71 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటర్ డీజిల్‌కు 15.42 కి.మీ. మైలేజీని ఇస్తుంది. తరచూ లాంగ్ ట్రిప్‌లకు వెళ్లే వారు, పెద్ద కుటుంబం కలిగిన వారికి టాటా వెంచర్ ఎమ్‌పివి ఓ చక్కటి ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

English summary
Tata Motors will soon launch a nation-wide service camp for Tata Venture owners called Tata Venture Service Camp. The service camp will be held from May 24 - 26, 2012, across 281 Tata Motors authorised dealerships in the country.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu