ఎరిక్ బ్యూయెల్‌ను పార్టనర్‌గా ఎంచుకున్న హీరో మోటోకార్ప్

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 17:28 [IST]
జపాన్ భాగస్వామి హోండా నుండి విడిపోయిన తర్వాత సోలో జర్నీ సాగిస్తున్న దేశీయ అగ్రమగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా)కు ఎట్టకేలకు తోడు దొరికింది. మార్కెట్లో తన అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు హీరో మోటోకార్ప్ ఓ సరైన సాంకేతిక భాగస్వామి (టెక్నాలజీ పార్ట్‌నర్) కోసం ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన గాలింపు చివరకు ఓ భాగస్వామిని ఎంచుకుంది.

అమెరికాకు చెందిన మోటార్‌సైకిల్ కంపెనీ "ఎరిక్ బ్యూయెల్ రేసింగ్" (ఈబిఆర్)తో జతకట్టినట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈబిఆర్‌తో భాగస్వామ్యంలో భాగంగా, హీరో మోటోకార్ప్ అందిచే భవిష్యత్ (ఫ్యూచర్) మోడల్స్ కోసం కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ, డిజైన్ నుండి డెవలప్‌మెంట్ వరకూ అన్ని రకాల సాంకేతిక మద్ధతును ఈబిఆర్ అందించనుంది.

హోండా కంపెనీతో హీరోకు ఉన్న కొత్త లైసెన్సు ఒప్పందం ప్రకారం 2014వ సంవత్సరం వరకూ హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం హీరో మోటోకార్ప్‌కు ఉంది. అయితే, వీలైనంత త్వరగా ఓ సాంకేతిక భాగస్వామిని ఎంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ కంపెనీతో హీరో మోటోకార్ప్ ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గడచిన మార్చిలో హోండాతో ఉన్న 26-ఏళ్ల బంధాన్ని హీరో మోటోకార్ప్ తెంచుకున్న సంగతి తెలిసిందే.
English summary
Hero MotoCorp, India's largest two wheeler manufacturer has announced a partnership with American motorcycle maker Erik Buell Racing. Erik Buell will be providing Hero the much needed expertise in technology and design after Hero ended its partnership with Honda.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .