Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

జపనీస్ మ్యాజిక్ బైక్ హోండా షైన్ - యూజర్ రివ్యూ

Posted by:
Published: Thursday, May 31, 2012, 12:58 [IST]

హాయ్.. నా పేరు శంకర్. నేను ఇప్పటి వరకూ నాలుగు బైక్‌లు ఉపయోగించాను. ప్రస్తుతం నేను ఉపయోగిస్తున్న బైక్ హోండా షైన్. జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా అందిస్తున్న ది బెస్ట్ మోటార్‌సైకిల్ హోండా షైన్. ఈ బైక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవర్, మైలేజ్, బడ్జెట్, పెర్ఫామెన్స్, పికప్, స్టయిల్, కంఫర్ట్ ఇలా అన్ని విషయాల్లో ఇది 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అనిపించుకుంటుంది.

హోండా షైన్, విజేతల ఎంపిక (విన్నర్స్ ఛాయిస్) అనే ట్యాగ్‌లైన్‌ను కలిగి ఉన్న ఈ బైక్ నిజంగా విజేతల ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ప్రధాన ప్రత్యేకత జపనీస్ టెక్నాలజీతో రూపొందిన 125సీసీ ఆప్టిమ్యాక్స్ (OPTIMAX) ఇంజన్. ఆప్టిమ్యాక్స్ అంటే గరిష్ట అవుట్‌పుట్ కోసం కనిష్ట ఇన్‌పుట్ (Optimum fuel input to Maximize pickup & mileage output)ని అందజేయటం అని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే, తక్కువ ఇంధనాన్ని గ్రహించి ఎక్కువ మైలేజ్, పవర్, పికప్‌లను అందించడం అన్నమాట.

japanese magic bike honda shine user review

కంపెనీ ప్రతిపాదించిన దాని ప్రకారం, హోండా షైన్ లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 65 కి.మీ. మైలేజీని ఇస్తుంది. అయితే వాస్తవానికి ఇది డ్రైవింగ్ చేసే విధానం, గేర్లు మార్చే విధానం, నడిపే రోడ్లపై ఆధారపడి ఉంటుంది. నా హోండా షైన్ మాత్రం సిటీ రోడ్లపై 50-55 కి.మీ. మైలేజీని, హైవే రోడ్లపై 55-60 కి.మీ. మైలేజీని ఇస్తుంది. హోండా షైన్ కేవలం 2.3 సెకండ్లలోనే 0.60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఆప్టిమ్యాక్స్ ఇంజన్‌లో హోండా పొందుపరచిన అనేక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీల ద్వారా ఇది సాధ్యమవుతుంది.

లాంగ్ రైడ్‌లకు వెళ్లాలనుకునే వారికి హోండా సిబి షైన్ చక్కగా సరిపోతుంది. సాధారణంగా కొన్ని బైక్‌లను ఎక్కువ దూరం నడిపితే నడుం నొప్పి రావటం జరుగుతుంది. అయితే హాండా షైన్‌లో ఈ బాద ఉండదు. దీనిలో ఉన్న ఎర్గో-టెక్ డిజైన్, డైమండ్ ఫ్రేమ్, 3-స్టెప్ సస్పెన్షన్ సిస్టమ్ కారణంగా ఎటువంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ఎంత దూరమైనా సరే హాయిగా ప్రయాణించవచ్చు. హోండా షైన్‌లో ముందు వైపు ఉండే డిస్క్ బ్రేక్ మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను కలిగిస్తుంది.

హోండా సిబి షైన్‌లో చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకమైన ఫీచర్ ట్యూబ్‌లెస్ టైర్స్. సాధారణంగా గ్రామీణ ప్రాంత రోడ్లపై టైర్లు ఎక్కువగా పంక్చర్ అవుతుండటాన్ని గమనిస్తుంటాం. అయితే, హోండా షైన్‌లో ఈ ఇబ్బంది ఉండదు. ఇది ట్యూబ్‌లెస్ టైర్ ఆప్షన్‌తో లభిస్తుంది కాబట్టి పంక్చర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇందులో అమర్చిన పవర్‌ఫుల్ మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఇంజన్ టక్కున ఆన్ అయ్యేందుకు సహకరిస్తుంది.

ఇక లుక్ విషయానికి వస్తే.. స్టయిలిష్ గ్రాఫిక్స్, ట్యాంక్‌పై 3డి హోండా లోగో, హ్యాండిల్ బార్, సరికొత్త సైడ్ మిర్రర్స్ డిజైన్, బాడీ కలర్‌లో ఉండే గ్రాబ్ రెయిల్, సైలెన్సర్ కవర్‌లు హోండా షైన్‌కు ఓ ప్రీమియం బైక్ లుక్‌నిస్తాయి. ఇక దీని ధర కూడా ఈ సెగ్మెంట్లో సరసమైనదే. నేను కొనుగోలు చేసినప్పుడు (డిసెంబర్ 2011)లో హోండా షైన్ ఆన్-రోడ్ ధర రూ.65,000/- (బెంగుళూరు). కాబట్టి.. పవర్, మైలేజ్, పికప్, బడ్జెట్‌ను పరిగణిలోకి తీసుకునే వారికి హోండా షైన్ ఒక చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.

English summary
Japanese bike maker Honda's 125cc bike Honda Shine got unique features which are the best in-class in this segment. Honda CB Shine is powered by Honda’s revolutionary 125cc OPTIMAX engine. OPTIMAX engine works on the principle of Optimum fuel input to Maximize pickup & mileage output, which are the two most important parameters of judging engine performance.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu