Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఎక్స్132 హెల్‌క్యాట్ బైక్‌ను కొనుగోలు చేసిన ఎమ్ఎస్ ధోనీ

Posted by:
Updated: Wednesday, January 9, 2013, 13:38 [IST]

అనతి కాలంలో అత్యంత పాపులర్ అయిన ఇండియన్ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా ఓ సూపర్‌బైక్‌ను సొంతం చేసుకున్నాడు. వేగంగా వెళ్లే బైక్‌లంటే మంచి క్రేజ్ ఉన్న ఈ కుర్ర క్రికెటర్ 'ఎక్స్132 హెల్‌క్యాట్' అనే సూపర్‌బైక్ విదేశాల నుంచి ఆర్డర్ చేయించి మరీ ఇండియాకు దిగుమతి చేయించుకున్నాడు. అమెరికాకు చెందిన ప్రముఖ సూపర్‌బైక్‌ల తయారీ కంపెనీ కాన్ఫెడరేట్ మోటార్‌సైకిల్స్ అందిస్తున్న పవర్‌ఫుల్ మోటార్‌సైకిళ్లలో ఎక్స్132 హెల్‌క్యాట్ కూడా ఒకటి.

ఇటీవలే ముగిసిన ఐపిఎల్ సీజన్ 5, ఢిల్లీలో జరుగుతున్న ప్పుడు ధోనీ ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు. ధోనీకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు వివిధ కంపెనీలు ధోనీకు భారీ మొత్తాలను ముట్టజెప్పుతూ, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించుకుంటున్న సంగతి తెలిసిందే. అమెరికన్ స్ట్రీస్ బైక్ డిజైన్‌ను తలపించే ఈ 'ఎక్స్132 హెల్‌క్యాట్' బైక్ పూర్తిగా చేతుల్తోనే తయారు చేస్తారు (హ్యాండ్ బిల్ట్).


ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్‌లో శక్తివంతమైన 2163 సీసీ (వామ్మో...) వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 132 బిహెచ్‌పిల శక్తిని, 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ విడుదల చేసే శక్తి దాదాపు ఓ ప్రీమియం కారు (చెవర్లే క్రూజ్ వంటిది)కు సమానం.

ఇండియాలో ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.27 లక్షలకు పైమాటే. ఎక్స్132 హెల్‌క్యాట్ బైక్‌ కొనుగోలుతో ఇండియాలో ఈ బైక్‌ను ఉన్న ఏకైక వ్యక్తిగా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఒకవేళ తర్వాత ఎవరైనా ఈ బైక్‌ను కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి మాత్రం మహేంద్ర సింగ్ ధోనీనే అవుతాడు.

ఎక్స్132 హెల్‌క్యాట్ బైక్ సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

మహేంద్ర సింగ్ ధోనీ వద్ద ఓ పవర్‌ఫుల్ హమ్మర్ హెచ్‌3 ఎస్‌యూవీ కూడా ఉంది. ఇంకా ఇతని గ్యారేజ్‌లో అనేక సూపర్‌కార్లు, సూపర్‌బైక్‌లు కొలువుతీరి ఉన్నాయి. ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్‌ కొనుగోలుతో.. ఇప్పటికే హెల్‌క్యాట్ బైక్‌లను కలిగి ఉన్న ఇంగ్లాడ్ ఫుట్ బాల్ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ వంటి ప్రముఖ సెలబ్రిటీల సరసన ధోనీ కూడా చేరిపోయాడు. మరి మన ధనాధన్ ధోనీ నరకపు పిల్లి (హెల్‌క్యాట్) బైక్ ఎలా ఉంది..?

Story first published:  Friday, June 1, 2012, 15:51 [IST]
English summary
It is no secret that Indian cricket captain Mahendra Singh Dhoni is an avid car and bike lover. He has a huge collection of vehicles which include 10 cars and 16 motorcycles. The latest vehicle to enter Dhoni’s stables is a Hellcat X132 super bike.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu