మొత్తానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి ప్రేమలో పడ్డాడు. అయితే, ఈసారి ప్రేమలో పడింది కత్రినా కైఫ్‌తోనో లేక మరో అందాల సుందరితోనో కాదు. సల్మాన్ ఖాన్ ప్రేమలో పడింది ఓ సూపర్‌బైక్‌తో. వేగంగా వెళ్లే బైక్‌లంటే క్రేజ్ ఉన్న సల్లు భాయ్ గ్యారేజ్‌లోకి, తాజాగా ఓ సుజుకి సూపర్‌బైక్ వచ్చి చేరింది. జపనీస్ టూవీలర్ కంపెనీ అందిస్తున్న సుజుకి మోటార్‌సైకిల్ అందిస్తున్న లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్ సల్మాన్ ఖాన్‌ను వరించింది.
ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న బడ్జెట్ బైక్ 'సుజుకి హయాటే'కు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, సల్మాన్ ఖాన్‌కు స్వతహాగా సుజుకి బ్రాండ్ మోటార్‌సైకిళ్లంటే కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే, ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్‌ను సల్మాన్ ఖాన్ కొనుగోలు చేశాడా లేక కంపెనీయే ఉచితంగా కానుకగా ఇచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది.
ఏదేమైనప్పటికీ, సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్ విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన 1.8 లీటర్ (1783సీసీ) ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో రెండు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో ఒకటి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ మరొకటి పవర్‌ఫుల్ ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్. సల్మాన్ సొంతం చేసుకుంది. పవర్‌ఫుల్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్. రాష్ట్ర మార్కెట్లో దీని ధర కేవలం రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) మాత్రమే.




































