Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్

Posted by:
Published: Saturday, July 7, 2012, 15:18 [IST]

ఈ బైక్‌ను చూశారా..? బాగా స్టయిలిష్‌గా ఉంది కదూ.. కానీ దీని ధర గురించి వింటేనే గుండె గుబేల్‌మంటుంది. అమెరికాకు చెందిన ఎకోస్స్ మోటో వర్క్స్ (American ECOSSE Moto Works) ఈ బైక్‌ను రూపొందించింది. ఈ మోటార్‌సైకిల్ పేరు 'ఐకానోక్లాస్ట్' (Iconoclast). దీని ధర జస్ట్ కేవలం 3,00,000 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో సుమారు 1.6 కోట్లు అన్నమాట.


లగ్జరీ ద్విచక్ర వాహనాలు, లిమిటెడ్ ప్రొడక్షన్ మోటార్‌సైకిళ్లను తయారు చేయటంలో ఎకోస్స్ మోటో వర్క్స్‌కు పెట్టింది పేరు. ఈ కంపెనీ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. అలా తయారు చేసిన వాటిల్లో ఐకానోక్లాస్ట్ మోటార్‌సైకిల్ కూడా ఒకటి. ఇలాంటివి కేవలం 11 బైక్‌లను మాత్రమే కంపెనీ తయారు చేసింది. వీటిని పూర్తిగా చేతులతోనే తయారు చేస్తారు.

కేవలం 3 సెకండ్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకునే ఆస్టన్ మార్టిన్, 2-లీటర్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి స్ఫూర్తి పొంది ఈ సూపర్‌బైక్‌ను డిజైన్ చేశారు. ఇందులో గరిష్టంగా 135 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే 2-లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. 6-స్పీడ్ ట్రాన్సిమిషన్, అత్యాధునిక బ్రేక్స్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఈ మోడల్‌ను తయారు చేశారు. ఇది కేవలం 2.8 సెకండ్లలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

English summary
ECOSSE Moto Works is the premier luxury marque of innovative, limited production motorcycles created for discerning enthusiasts. Recently this company has created the 135hp handcrafted Iconoclast motorcycle. In the US its sells for $300,000 and in the India it would come up to 1.6 crore.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu