Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

యమహా రే ఉత్పత్తికి రంగం సిద్ధం; దీపావళికి విడుదల

Posted by:
Updated: Wednesday, July 11, 2012, 16:33 [IST]

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఇండియా మోటార్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే' (Yamaha Ray) విడుదలకు ముస్తాబవుతోంది. యమహా ఇండియా గత కొద్దిరోజులుగా 'రే' స్కూటర్‌ను ఇండియన్ రోడ్లపై టెస్ట్ రన్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఈ స్కూటర్ దేశయ మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల కావాటానికి కావల్సిన ఫార్మాలటీలన్నింటినీ పూర్తి చేసుకుంది. యమహా రే స్కూటర్‌ను ఐక్యాట్ (ఇంటర్నేషల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ) కూడా సర్టిఫై చేసింది.

అంతేకాకుండా, యమాహా రే స్కూటర్‌ ఉత్పత్తిని చేపట్టేందుకు కూడా కంపెనీ చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సర్జాపూర్‌లో ఉన్న యమహా ప్లాంటులో స్కూటర్ల తయారీ కోసం కొత్తగా అసెంబ్లీ కేంద్రాన్ని కంపెనీ ఏర్పాటు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పెట్టుబడుల వివరాలు వెల్లడి కాకపోయినప్పటికీ, గతంలో కంపెనీ ఇందు కోసం రూ.750 కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది.


ప్రస్తుతం ఏటా ఆరు లక్షల యూనిట్లుగా ఉన్న ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటి వరకూ యమహా భారతీయ పురుషులను టార్గెట్ చేసుకొని బడ్జెట్, స్పోర్ట్స్, సూపర్ బైక్‌లను అందిస్తూ వచ్చింది. అయితే, యమహా రే స్కూటర్‌ను మాత్రం ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీనిని డిజైన్ చేసింది.

యమహా స్కూటర్లకు గ్లోబల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా అక్కడి యువతులు ఈ స్కూటర్ల పట్ల మంచి క్రేజ్‌ను కలిగి ఉంటారు. అదేవిధంగా ఇక్కడి మార్కెట్లో కూడా యమహా రే స్కూటర్ మంచి సక్సెస్‌ను సాధించగలదని కంపెనీ భావిస్తోంది. ఈ దీపావళి కానుకగా యమహా రే స్కూటర్ ఇండియన్ మార్కెట్లో చిచ్చు బుడ్డిలా స్కూటర్ సెగ్మెంట్లో చిచ్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

పవర్‌ఫుల్ 125సీసీ ఇంజన్‌తో రానున్న యమహా రే స్కూటర్ ఈ సెగ్మెంట్లోని సుజుకి యాక్సెస్, స్విష్, మహీంద్రా డ్యూరో డిజెడ్, రోడియో ఆర్‌జెడ్ వంటి మోడళ్లతో తలపడనుంది. యమహా రే స్కూటర్‌లో ఉపయోగించిన 125సీసీ ఇంజన్‌ గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనుంది. దేశీయ విపణిలో ఈ స్కూటర్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Story first published:  Wednesday, July 11, 2012, 16:32 [IST]
English summary
Japanese two-wheeler major Yamaha India Motor is all set launch its much awaited scooter Ray in India by Diwali. The company has set up an additional assembly line which will be dedicated to the scooter production at its Surajpur facility at Uttar Pradesh.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu