Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

సెప్టెంబర్ 14న మార్కెట్లోకి రానున్న యమహా రే స్కూటర్

Posted by:
Updated: Friday, August 31, 2012, 12:56 [IST]

భారతీయ యువతులను టార్గెట్ చేస్తూ.. జపనీస్ స్పోర్ట్స్ బైక్ మేకర్ యమహా దేశీయ విపణిలో తొలిసారిగా అందించనున్న 'యమహా రే' స్కూటర్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. వచ్చే నెల 14న ఈ స్కూటర్ మార్కెట్లో వాణిజ్యపరంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యమహా రే స్కూటర్ కోసం కంపెనీ ఇప్పటి నుంచే బకింగ్‌లను స్వీకరిస్తోంది. ఇందుకోసం కంపెనీ ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించింది.

ఈ స్కూటర్ పట్ల ఆసక్తి కలిగిన వారు యమహా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి తమ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమ్మాయిలను దృష్టిలో ఉంచుకొని యమహా ఈ స్కూటర్‌ను డిజైన్ చేసింది. యమహా రే స్కూటర్ స్టయిలిష్ గ్రాఫిక్స్, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, ఆకర్షనీయమైన ఏరోడైనమిక్స్‌లను కలిగి ఉండి నేటి యువతరాన్ని ఇట్టే ఆకట్టుకుంటుంది.


యమహా రే స్కూటర్‌కు మార్కెట్లో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు గానూ బాలీవుడ్ అందాల భామ దీపికా పడుకొనేను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు యమహా తెలిపింది. ఈ స్కూటర్‌లో పవర్‌ఫుల్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనుంది. దేశీయ విపణిలో ఈ స్కూటర్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఇండియన్ స్కూటర్ ఈ సెగ్మెంట్లోని హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, సుజికి స్విష్, మహీంద్రా డ్యూరో డిజెడ్, మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలువనుంది. యమహా రే స్కూటర్ సెప్టెంబర్ 14, 2012వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది. ఈ స్కూటర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Story first published:  Monday, August 20, 2012, 17:06 [IST]
English summary
Yamaha is all set to launch its first scooter in India. Yamaha Ray scooter to be launched on September 14th, 2012. Company has already opened bookings for Ray Scooter.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu