సరసమైన ధరకే మార్కెట్లో విచ్చేసిన యమహా రే స్కూటర్

Posted by:

ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని యమహా ఇండియా అభివృద్ధి చేసిన తమ తొలి స్కూటర్ 'యమహా రే'ను కంపెనీ నేడు (సెప్టెంబర్ 14, 2012 శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్లో లాంఛనంగా విడుదల చేసింది. సరికొత్త డిజైన్, స్టయిలిష్ లుక్ కలిగిన ఈ స్కూటర్‌ను కంపెనీ సరసమైన ధరకే అందిస్తోంది. భారత మార్కెట్లో యమహా రే స్కూటర్ ధర కేవలం రూ.46,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే.


ధర పరంగా చూసుకుంటే ఈ సెగ్మెంట్లో కెల్లా యమహా రే అత్యంత చవక స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. యమహా రేలో ఇది వరకు చెప్పుకున్నట్లు 125సీసీ ఇంజన్‌ను కాకుండా 113సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7 హెచ్‌పిల శక్తిని, 8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే, యమహా రే స్కూటర్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండనుంది. అంతేకాకుండా ఇది లీటరు పెట్రోల్‌కు 61.1 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు.

యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. యమహా రే స్కూటర్ ద్వారా ద్విచక్ర వాహన సెగ్మెంట్లో గరిష్ట మార్కెట్ వాటాను ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే, ఈ స్కూటర్‌కు మార్కెట్లో అశేష ఆదరణ లభిస్తోంది. యమహా రే స్కూటర్ కోసం కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ భామ దీపికా పడుకొనేను కంపెనీ నియమించుకున్న విషయం తెలిసిందే.

Story first published: Friday, September 14, 2012, 12:19 [IST]
English summary
India Yamaha Motor has finally entered the Indian scooter market by launching the new Ray scooter at a glittering event in Hyderabad. Yamaha's first scooter in India is available with a starting price of Rs.46,000 (ex-showroom price Delhi).
Please Wait while comments are loading...

Latest Photos