
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ రూ.1500 కోట్ల పెట్టుబడితో తమిళనాడులోని చెన్నైలో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. భారత మార్కెట్లో డిమాండుకు తగినట్లుగా ఉత్పత్తులను అందించేందుకు అలాగే, భవిష్యత్తులో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునేందుకు ఈ ప్లాంటును ఏర్పాటు చేయనున్నామని కంపెనీ తెలిపింది.
భారతీయ మహిళ కోసం యమహా తొలిసారిగా అందిస్తోన్న మొట్టమొదటి స్కూటర్ యమహా రేను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, యమహా మోటార్ కార్పోరేషన్ అధ్యక్షుడు హిరోయోకి యనాగి మాట్లాడుతూ.. ఈ కొత్త ప్లాంటును 2014 నాటికి నిర్వహణలోకి తీసుకువస్తామని, ఈ ప్లాంటు ద్వారా ఏటా 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.
యమహా ఇండియా 2018 తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 28 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో ఉత్పత్తి అయిన వాహనాలను పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా, ఈ ఉత్పత్తి విస్తరణ ప్రణాళిక సహకరించనుంది. ఇదిలా ఉండగా, కేవలం రూ.46,000 ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే యమహా ఇండియా రే స్కూటర్‌ను దేశీయ విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
యమహా రేలో 113సీసీ 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్ (సివిటి) సిస్టమ్‌తో లభించే యమహా రే స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 62.1 కి.మీ. మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) కంపెనీ పేర్కొంది. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.




















