ఇండోనేషియాకు వెళ్లనున్న బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

By Ravi

గడచిన సంవత్సరం బజాజ్ ఆటో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ (నేక్‌డ్ స్పోర్ట్స్) స్పోర్ట్స్ బైక్‌ ఇకపై అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌ను రానున్న మే నెలలో ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం దేశీయ విపణిలో లభ్యమవుతున్న మోడల్‌నే కంపెనీ ఇండోనేషియన్ మార్కెట్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉంది. డిజైన్ పరంగా, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.

బజాజ్ ఆటో తమ జపనీస్ భాగస్వామి కవాసకికు ఇండోనేషియాలో ఉన్న డీలర్‌షిప్‌ల ద్వారా కొత్త పల్సర్ 200ఎన్ఎస్‌ బైక్‌ను విక్రయించనుంది. అక్కడి మార్కెట్లో ఇది ధర పరంగా యమహా విక్సిన్ (యమహా ఆర్15 స్ట్రీట్ ఫైటర్ వెర్షన్), హోండా సిబిఆర్150ఆర్ స్ట్రీట్ ఫైర్ (హోండా సిబిఆర్150ఆర్ నేక్డ్ వెర్షన్) బైక్‌లతో ఇది పోటీపడనుంది.

Bajaj Pulsar 200NS

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌ విషయానికి వస్తే, ఇందులో ప్రపంచంలో కెల్లా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 136 కిలోమీటర్లు. భారత మార్కెట్లో ఇది లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Auto is gearing to export its flagship motorcycle, the Pulsar 200 NS to Indonesian markets. The all-new Bajaj Pulsar 200NS is expected to be sold through Kawasaki dealerships in Indonesia.
Story first published: Thursday, March 21, 2013, 18:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X