భారత్‌లో ద్విచక్ర వాహనాలకు కొత్త కాలుష్య నిబంధనలు!

By Ravi

మనదేశంలోని ద్విచక్ర వాహనాల విషయంలో త్వరలోనే కాలుష్య నిబంధనలు (ఎమిషన్ నామ్స్) మారనున్నాయి. 2015 నుంచి ద్విచక్ర వాహనాల కోసం కాలుష్య నిబంధనలు సవరించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇదే గనుక జరిగితే, కొత్త కాలుష్య నిబంధనలను పాటించేందుకు ద్విచక్ర వాహనాల తయారీదారులు తమ ఉత్పత్తుల విషయంలో తగిన మార్పులు చేయటం వలన ఉత్పాదక వ్యయం పెరుగుతుంది. ఫలితంగా, మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు కూడా మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది.

యూరోపియన్ యూనియన్ లేదా ఇతర దేశాల్లో అమల్లో ఉన్న విధంగా కొత్త కాలుష్య నిబంధనలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత విభాగాలు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని ఓ ప్రభుత్వాధికారి ఎకనామిక్ టైమ్స్ పత్రికకు వెల్లడించారు. ఈ కొత్త ప్రమాణాల వల్ల కాలుష్యం దాదాపు 25 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు.


ఒకవేళ ఈ కొత్త కాలుష్య నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, తయారీదారులు ఈ లక్ష్యాన్ని చేరుకునేందుతు తమ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఇంజన్లలో తగిన మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. తయారీదారులు ఇందుకు అయ్యే ఖర్చును వినియోగదారులపై మోపే అవకాశం ఉంటుంది. ఇదే గనుక జరిగితే, కొనుగోలుదారులు ప్రతి ద్విచక్ర వాహనంపై మోడల్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.10,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం బిఎస్3 నిబంధనల ప్రకారం, ద్విచక్ర వాహనాలను ప్రతి కిలోమీటరుకు 1 గ్రాము కార్బన్ మోనాక్సైడ్‌ను మరియు కిలోమీటరుకు 1 గ్రాము హైడ్రోకార్బన్స్ అండ్ నైట్రోజెన్ ఆక్సైడ్స్‌ను విడుదల చేయటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. భారతదేశంలో సుమారు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కాలుష్య నిబంధనలను సవరించడం జరుగుతుంటుంది. రోడ్డుపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో కాలుష్య నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Splendor iSmart

ఈ విషయంలో హీరో మోటోకార్పో ఓ అడుగు ముందే ఉంది. కొత్త కాలుష్య ప్రమాణాలు అమల్లోకి రాకముందే, తమ కొత్త ఉత్పత్తులను ప్రకృతి సాన్నిహిత్యంగా ఉండేలా కంపెనీ తయారు చేస్తోంది. అధునాతన ఇంధన ఆదా సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సరికొత్త ఉత్పత్తులను హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది విడుదల చేయనుంది. ఇందులో స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో కూడిన కొత్త స్ప్లెండర్ ఐస్మార్ట్, ఈకో టెక్నాలజీతో కూడిన హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో మోడళ్లు చెప్పుకోదగినవి.
Most Read Articles

English summary
The Government of India will bring into effect revised emission norms for two wheelers from 2015 onwards. This in term will also make scooters and motorcycles more expensive as manufacturers will be required to make improvements to comply with the new norms.
Story first published: Tuesday, December 3, 2013, 10:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X