సైకిళ్లకు లోన్ సౌకర్యం; త్వరలో ఎలక్ట్రిక్ సైకిల్స్ లాంచ్

By Ravi

మీ దగ్గర సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేవా..? అయితే, డోంట్ వర్రీ.. ఇప్పుడు సైకిల్‌కి కూడా లోన్ లభ్యం కానుంది. కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి ఫైనాన్షియల్ కంపెనీలు ఎలాగైతే రుణాన్ని ఆఫర్ చేస్తున్నాయో, అలాగే సైకిళ్లను కొనుగోలు చేసేందుకు కూడా రుణాన్ని ఆఫర్ చేయనున్నారు. ప్రపంచ అగ్రగామి సైకిళ్ల ఉత్పత్తి సంస్థ హీరో సైకిల్స్ ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించింది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో సైకిల్‌ను కొనుగోలు చేసేంత ఆర్థిక సామర్థ్యం కూడా లేని బలహీన ప్రజలు ఉన్నారని, వారి కోసం వాయిదా చెల్లింపు చెల్లింపు పద్ధతిలో సైకిల్‌ను విక్రయించేలా ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నామని హీరో సైకిల్స్ పేర్కొంది. హీరో సైకిల్స్ ఇప్పటికే ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, గుజరాత్‌లో ప్రయోగాత్మక ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి రానుంది.


మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నివసించే బలహీన వర్గాలకు సైకిల్ కొనుగోలు కోసం రుణాలు ఇచ్చేందుకు గాను హీరో సైకిల్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి) అయిన ఫుల్లెట్రన్ ఇండియాతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ రుణానికి అర్హులైన వారిని ఎంపిక చేసి రుణాన్ని మంజూరు చేస్తుంది. తక్కువ వడ్డీ రేటుకే 100 శాతాన్ని రుణాన్ని ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా..
హీరో సైకిల్స్ ఈ సైకిల్ ఫైనాన్స్ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌తో సహా కర్ణాటక, రాజస్తాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకురానుంది.

హీరో ఏ2బి ఎలక్ట్రిక్ సైకిల్స్..
ఇదిలా ఉండగా, హీరో గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్, ప్రీమియం సైకిళ్ల తయారీ కంపెనీ హీరో ఎకో భారత్‌లో తమ ఎలక్ట్రిక్ సైకిళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఏ2బి బ్రాండ్ క్రింద విదేశాల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిళ్లు త్వరలోనే భారత్‌లో కూడా లభ్యం కానున్నాయి. హీరో ఏ2బి ఎలక్ట్రిక్ సైకిళ్లను జర్మనీలో డిజైన్ చేస్తున్నారు. తేలికపాటి ధృఢమైన అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారైన ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను సాధారణ సైకిళ్ల మారిదిగా పెడలింగ్ చేస్తూ తొక్కుకోవచ్చు లేదంటే బ్యాటరీ సాయంతో నడుపుకోవచ్చు.

Hero A2B

అధక రేంజ్ కోసం వీటిల్లో లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ ఛార్జింగ్‌కు పట్టే సమయం 3 గంటలు, పూర్తి చార్జ్‌పై ఇది 100 కి.మీ. వరకు పరుగులు తీస్తుంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ గంటకు 60 కి.మీ. వేగంతో పరుగలు తీస్తుంది. ఈ సైకిళ్ల బరువు 25-35 కిలోల రేంజ్‌లో ఉంటాయి. అయితే, వీటి ధర కూడా అధికంగానే ఉండనుంది (సుమారు లక్షకు పైగా ఉండొచ్చని అంచనా).
Most Read Articles

English summary
Hero Cycles said it is tying up with financial institutions across the country to enable weaker sections of the society to get loans for buying bicycles. As part of the tie up, the financial institutions would promote the Hero Cycles brand in their respective territories, the company said.
Story first published: Friday, September 20, 2013, 9:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X