క్యూ2లో 9 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ లాభం

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే కంపెనీ ఏకీకృత నికర లాభం 9.26 శాతం వృద్ధి చెంది రూ.481.40 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో హీరో మోటోకార్ప్‌ రూ.440.58 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 10.58 శాతం వృద్ధి చెంది రూ.5,151 కోట్ల నుంచి రూ.5,696 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 14,16,276 వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలోకంపెనీ మొత్తం అమ్మకాలు 13,32,805 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు గడచిన సంవత్సరంతో పోల్చుకుంటే 6.26 శాతం వృద్ధిని కనబరచాయి.

Hero MotoCorp

ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని, హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్‌ ముంజాల్‌ వెల్లడించారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగ్గా ఉందని, కొనుగోళ్లు కూడా సానుకూలంగానే ఉన్నాయని, ద్వితీయ త్రైమాసికంలో తమ పనితీరును పరిశీలిస్తే, తాము పటిష్టమైన మార్జిన్లను సాధించగలమనే విషయాన్ని చాటిచెప్పామని ఆయన అన్నారు.
Most Read Articles

English summary
India's largest two-wheeler maker Hero MotoCorp has reported its first increase in quarterly profits in five quarters. Company net profit stood at Rs 481.41 crore in Q2, a rise of 9.3 per cent compared to Rs 440.5 crore in the corresponding period last year.
Story first published: Thursday, October 24, 2013, 10:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X