హోండా సిబిఆర్300ఆర్ బైక్ స్పెసిఫికేషన్స్ వెల్లడి

By Ravi

జపనీస్ ద్విచక్ర వాహన దిగ్గజం హోండా ఇటీవలే చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్‌సైకిల్ వర్తక ప్రదర్శనలో (సిమామోటార్) హోండా తమ అధునాతన హోండా సిబిఆర్300ఆర్ (Honda CBR300R) స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, తాజాగా హోండా సిబిఆర్300ఆర్ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మరియు ఈ బైక్ స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడి చేసింది. ఇందులో 76 మి.మీ బోర్, 63 మి.మీ. స్ట్రోక్‌తో కూడిన 286సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

Honda CBR300R

హోండా సిబిఆర్250ఆర్‌లో 76 మి.మీ బోర్, 55 మి.మీ. స్ట్రోక్‌తో కూడిన 249.6సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. అంటే, ఈ కొత్త ఇంజన్‌ను ప్రస్తు 250సీసీ వెర్షన్ ఇంజన్‌ను ఆధారంగా చేసుకొని మరింత పెద్దగా ఉండేలా డిజైన్ చేశారన్నమాట.

సిబిఆర్300ఆర్‌లో ఉపయోగించిన ఈ రీట్యూన్డ్ 286సీసీ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 30.4 హెచ్‌పిల శక్తిని, 7250 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (ప్రస్తుత సిబిఆర్ 9900 ఆర్‌పిఎమ్ వద్ద 26 హెచ్‌పిల శక్తిని, 7400 ఆర్‌పిఎమ్ వద్ద 22.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది). ఇది ఈ సెగ్మెంట్లోని కవాసకి నిన్జా 300తో నేరుగా తలపడనుంది.

Most Read Articles

English summary
The upcoming Honda CBR300R will be powered by a 286cc, single cylinder engine, with a 76mm bore and 63mm stroke. In comparison, the CBR250R's 249.6cc engine has 76mm bore and 55mm stroke, which proves the new engine is just a larger version of the existing engine, instead of being a completely new one.
Story first published: Saturday, October 19, 2013, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X