భారత్‌కు ఆల్ టెర్రైన్ వాహనాలను తీసుకురానున్న హోండా

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీ, ఇప్పుడు భారత్‌కు తమ ఆల్ టెర్రైన్ వెహికల్స్ (ఏటివిల)ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. భారత్‌లో ఏటివిలకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని హోండా యోచిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలోకి తొలుతగా ప్రవేశించిన అమెరికా చెందిన పోలాసిర్, భారత మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే.

భారతదేశంలో సాలీనా దాదాపు 1,200 ఆల్ టెర్రైన్ వాహనాలు అమ్ముడుపోతున్నాయి. భారత్‌లో వీటి ధరలు రూ.8 లక్షలు (సింగిల్ సీటర్) నుంచి రూ.28 లక్షల (4,6 సీటర్) రేంజ్‌లో ఉన్నాయి. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో శరవేగంగా వృద్ధి చెందుతూ, దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌కు గట్టి పోటీ ఇస్తూ, ఇటీవలే ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న హోండా, ఇప్పుడు ఏటివి విభాగంలో కూడా అదే తరహా సక్సెస్‌ను సాధించుకోవాలని భావిస్తోంది.

Honda ATV

ఆల్ టెర్రైన్ వాహనాల విభాగంలో హోండా ప్రపంచ వ్యాప్తంగా ద్వితీయ స్థానాన్ని కలిగి ఉంది (ప్రథమ స్థానంలో అమెరికాకు చెందిన పోలారిస్ సంస్థ ఉంది). గడచిన రండేళ్లుగా గమనిస్తే, భారత మార్కెట్లో ఏటివి విభాగం పటిష్టంగా వృద్ధి చెందుతోందని, వీటికి డిమాండ్ కూడా స్థిరంగా ఉంటోదని, ప్రధానంగా వ్యక్తులు, సేవల రంగం, అడ్వెంచర్ పార్క్స్, ఆఫ్-రోడింగ్ ప్రియుల నుండి డిమాండ్ ఎక్కువగా ఉంటోదని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Most Read Articles

English summary
India's second largest two-wheeler maker Honda Motor Company is planing to bring its high-end all terrain vehicles (ATVs) to India to cash in on the rising demand for such vehicles.
Story first published: Tuesday, October 15, 2013, 8:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X