హీరో స్ప్లెండర్‌కు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా బడ్జెట్ బైక్

By Ravi

భారత టూవీలర్ మార్కెట్లో అత్యధికంగా అమ్మడవుతున్న హీరో స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌ను టార్గెట్ చేస్తూ, జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ఓ బడ్జెట్ బైక్‌ను విడుదల చేయనుంది. ప్రధానంగా మాస్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, 100-110సీసీ విభాగంలో ఓ చవక బైక్‌ను హోండా ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న అత్యంత చవక బైక్ హోండా డ్రీమ్ యుగకు దిగువన ఈ కొత్తత బడ్జెట్ బైక్ విడుదల కానుంది.

డ్రీమ్ యుగ ప్లాట్‌ఫామ్‌పై డ్రీమ్ సిరీస్‌లో తక్కువ ధరకే లభ్యం కానున్న ఈ బైక్‌ను కంపెనీ ఇప్పటికే కె23 అనే కోడ్‌ నేమ్‌తో అభువృద్ధి చేస్తున్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో ఇది మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. ఈ కొత్త అధిక మైలేజ్‌ని ఆఫర్ చేస్తూ, ఈ సెగ్మెంట్లోని హీరో స్ప్లెండర్, బజాజ్ డిస్కవర్, స్టార్ సిటీ వంటి మోడళ్లతో తలపడనుంది. ఏప్రిల్ 2013 నుండి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎమ్ఎస్ఐ 6 లక్షల 100-110సీసీ బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంఖ్య హీరో స్ప్లెండర్ బ్రాండ్ అమ్మకాల్లో కేవలం 25 శాతం మాత్రమే. ఇదే సమయంలో హీరో మోటోకార్ప్ 21-22 లక్షల స్ప్లెండర్ బ్రాండ్ వాహనాలను విక్రయిస్తోంది. హీరో స్ప్లెండర్ బ్రాండ్‌లో స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్రో, స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి, సూపర్ స్ప్లెండర్ మోడళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో హోండా ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న డ్రీమ్ యుగ మరియు త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్న డ్రీమ్ సిరీస్ బడ్జెట్‌ బైక్‌లను కలిపి మొత్తం 12 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Honda Dream Yuga
Most Read Articles

English summary
Honda Motorcycle & Scooters India is reportedly planning to launch a new motorcycle in the 100cc - 110cc segment that will compete against Hero MotorCorp's highly successful Splendor, according to ET.
Story first published: Friday, March 29, 2013, 12:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X