భారత్‌లో కవాసకి జెడ్1000, నిన్జా 1000 బైక్‌లు విడుదల

By Ravi

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ కవాసకి, భారత సూపర్‌బైక్ మార్కెట్లోకి మరో రెండు సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇటీవలే నిన్జా జెడ్ఎక్స్-10ఆర్, జెడ్ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్‌లను విడదల చేసిన కవాసకి, తాజాగా జెడ్1000 మరియు నిన్జా 1000 (Kawasaki Z1000, Ninja 1000) మోడళ్లను దేశీయ విపణిలో విడుదల చేసింది.

కవాసకి జెడ్1000 స్ట్రీట్-నేక్డ్ మోటార్‌సైకిల్ కాగా నిన్జా 1000 ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్. ఇవి రెండు డిజైన్ పరంగా మాత్రమే భిన్నంగా ఉంటాయి. వీటిలో ఉపయోగించిన ఇంజన్ మాత్రం ఒక్కటే. ఈ రెండు బైక్‌లలో 1043సీసీ, ఇన్-లైన్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, 16-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Kawasaki Z1000

ఈ ఇంజన్ గరిష్టంగా 10000 ఆర్‌పిఎమ్ 142 పిఎస్‌ల శక్తిని, 7300 ఆర్‌పిఎమ్ వద్ద 111 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు బైక్‌లలో 3-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు పవర్ సెలక్షన్ మోడ్‌లతో లభిస్తాయి.

కవాసకి జెడ్1000 బైక్‌లో ముందు వైపు 310 మి.మీ డ్యూయెల్ పెటల్ డిస్క్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), నిన్జా 1000లో ముందు వైపు 300 మి.మీ. డ్యూయెల్ పెటల్ డిస్క్స్ కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు బైక్‌లలో వెనుక వైపు సింగిల్ పెటల్ డిస్క్ బ్రేక్ స్టాండర్డ్‌‌గా ఉంటుంది.


కవాసకి జెడ్1000 మరియు కవాసకి నిన్జా 1000 బైక్‌లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. భారత మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
  • కవాసకి జెడ్1000 - రూ. 12.50 లక్షలు
  • కవాసకి నిన్జా 1000 - రూ. 12.50 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, పూనే)

Most Read Articles

English summary
India Kawasaki Motors (IKM) has launched two of its globally renowned motorcycles - Z1000- the first naked bike in India, and Ninja 1000 to strengthen its presence in India’s high end motorcycle market. The Z1000 as well as the Ninja 1000 are priced at Rs 12,50,000 lakh (ex-showroom, Pune).
Story first published: Monday, December 23, 2013, 17:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X