మాగ్నెటి మారెల్లితో హీరో మోటోకార్ప్ జాయింట్ వెంచర్

By Ravi

ఇంజన్ల తయారీలో హోండాతో హీరో మోటోకార్ప్‌కు ఉన్న ఒప్పందం మరో ఏడాది కాలంలో ముగిసిపోనున్న నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కొత్త సాంకేతిక భాగస్వాముల కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, హీరో మోటోకార్ప్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మాగ్నెటి మారెల్లితో ఓ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకుంది.

తమ సంస్థ చరిత్రలో ఈ ఒప్పందం ఓ కీలకమైన మైలురాయిగా మిగిలిపోతుందని భావిస్తున్నామని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్‌ ముంజాల్‌ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా, కొత్తగా ఏర్పడిన ఈ జాయింట్ వెంచర్‌లో హీరో మోటోకార్ప్ 60 శాతం వాటాను కలిగి ఉంటుంది, మిగిలిన 40 శాతం వాటాను మాగ్నెటి మారెల్లి కలిగి ఉంటుంది.


'హెచ్ఎమ్‌సి-ఎమ్ఎమ్ ఆటో లిమిటెడ్'గా పిలువనున్న ఈ జాయింట్ వెంచర్‌ భారత్‌లో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ ప్లాంటును ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది, పెట్టుబడి తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే, ఈ కొత్త జేవి ఇప్పటి నుండే పనులు ప్రారంభించడం జరుగుతుంది.

ప్రారంభంలో భాగంగా, మోటార్‌సైకిళ్ల డిజైన్, డెవల్‌మెంట్ అంశాలపై ఈ జేవి దృష్టి సారించనుంది. అంతేకాకుండా, టూ-వీలర్‌ ఇంజన్‌ వ్యవస్థలను కూడా మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నారు. ఈ జాయింట్ వెంచర్‌ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం ఏర్పాటు చేసుకున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. అంటే, త్వరలోనే హీరో మోటోకార్ప్ నుంచి అధునాతన టెక్నాలజీతో కూడిన మోటార్‌సైకిళ్లను మనం చూడబోతున్నామన్నమాట.

Eugenio Razelli Pawan Munjal

గడచిన రెండు దశాబ్దాల వ్యవధిలో ఫ్యూయల్‌ టెక్నాలజీ ఎంతో రూపాంతరం చెందిందని, సమీప భవిష్యత్‌లో కూడా వినూత్న మార్పులు రానున్నాయని పవన్ ముంజాల్ చెప్పారు. ఈ సందర్భంగా.. మాగ్నెటి మారెల్లీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ యుజినియో రాజెల్లి మాట్లాడుతూ.. పంచంలోనే అత్యధికంగా బైక్‌లను విక్రయిస్తున్న సంస్థ అయిన హీరో మోటోకార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
Most Read Articles

English summary
Magneti Marelli S.p.A. and Hero MotoCorp Ltd. have signed a Joint Venture agreement aimed at the production of powertrain systems for the two-wheeler market. According to this agreement, Hero MotoCorp will hold a 60% share in the Joint Venture, with the remaining 40% being held by Magneti Marelli. The construction of a JV’s production plant is planned by 2015, at a location in India to be defined shortly.
Story first published: Wednesday, December 4, 2013, 9:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X