అమెరికాలో అత్యధికంగా దొంగిలించబడే మోటార్‌సైకిళ్లు

By Ravi

అమెరికాలో బైక్ దొంగలకు కూడా ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుందండోయ్.. అక్కడి దొంగలు ఆషామాషీ బైక్‌లను దొంగిలించరు. వారు దొంగిలించే బైక్‌లకు వారికి టేస్ట్‌కు తగినట్లు ప్రత్యేకమైనవే. నేషనల్ క్రైమ్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌సిఐసి) నుంచి సేకరించిన గణాంకాలతో యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇన్సూరెన్స్ క్రైమ్ బ్యూరో (ఎన్ఐసిబి) ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం, అమెరికాలో 2012 సంవత్సరంలో అత్యధికంగా దొంగిలించబడిన బైక్ వివరాలను పేర్కొనడం జరిగింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బైక్‌లన్నీ జపానీస్ మోటార్‌సైకిళ్లే కావటం విశేషం. గడచిన 2012 మొత్తం 46,061 ద్విచక్ర వాహనాలు దొంగిలించబడినట్లు రిపోర్ట్ కాగా, అందులో 9,082 ద్విచక్ర వాహనాలు హోండా బ్రాండ్‌కు చెందినవే కావటం గమనార్హం.

Most Stolen Motorcycle Two Wheelers In The United States

ఈ జాబితాలో వరుసగా యమహా (7515) ద్వితీయ స్థానంలో, సుజుకి (7017) తృతీయ స్థానంలో, కవాసకి (4839) నాల్గవ స్థానంలో, హ్యార్లీ డేవిడ్‌సన్ (3755) ఐదవ స్థానంలో ఉన్నాయి. ఇకపోతే ఆరవ స్థానంలో స్కూటర్లు, ఏటివిలు, డర్ట్ బైక్‌లు మరియు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే టావోటావో కంపెనీ ఉంది.

ఈ నివేదికలో కేవలం బైక్‌ బ్రాండ్‌ల చోరీ గురించే కాకుండా, చోరీలు అధికంగా జరిగిన ప్రదేశాల గురించి కూడా వెల్లడించారు. ఇందులో కాలిఫోర్నియా (6082) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఫ్లోరిడా (4110), టెక్సాస్ (3400), నార్త్ కాలిఫోర్నియా (2574), ఇండియానా (2334) ప్రదేశాలున్నాయి. నగరాల వారీగా చూసుకుంటే, న్యూయార్క్ సిటీ (903), లాస్ వేగాస్ (757), శాండీగో (633), ఇండియానాపోలిస్ (584), మియామి (535)లు అగ్రస్థానంలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Ever wondered which motorcycles thieves prefer to steal the most? The United States National Insurance Crime Bureau (NICB) has released data collected by the National Crime Information Center (NCIC) which provide a clear picture of which two wheeler was the most stolen in the year 2012, in the United States. 
Story first published: Wednesday, December 4, 2013, 12:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X