పెట్రో వాత: లీటరుపై రూ.1.40 చొప్పున పెంపు

Petrol Price Hike
బడ్జెట్ భారంతో మూలుగుతున్న సామాన్యుడి నడ్డిపై చమురు కంపెనీలు మరింత భారాన్ని మోపాయి. దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు ఈసారి లీటరుపై రూ.1.40 చొప్పున పెంపును విధించాయి. పెరిగిన శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

గత నెల 16న కూడా చమురు కంపెనీ లీటరుపై రూ.1.50 చొప్పున పెంపును విధించిన విషయం తెలిసినదే. జనవరిలో కూడా స్వల్పంగా పెట్రోల్ ధరలను (న్యూఢిల్లీలో) పెంచారు. ఈ సంవత్సరంలో పెట్రోల్ ధరలను పెంచడం ఇది మూడవసారి.

అంతర్జాతీయ మార్కెట్లలో ఆయిల్ ధరలు పెరగటం, రూపాయి విలువ పతనం అవుతుండంటతో వేరే మార్గం లేక ధరలను పెంచుతున్నామని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశంలో పలు ప్రధాన నగరాల్లో అమల్లో ఉన్న పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* ఢిల్లీ - రూ.70.74
* ముంబై - రూ.77.66
* కలకత్తా- రూ.78.34
* చెన్నై - రూ.73.95

Most Read Articles

English summary
Petrol price has gone up by Rs 1.40 per litre. A rise in international oil prices and depreciation in rupee have necessitated a Rs 1.40 per litre increase in price of petrol with effect from midnight tonight, said a statement by Indian Oil Corporation (IOC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X