సుజుకి మోటార్‌సైకిల్ గుర్గావ్ ప్లాంట్‌లో సమ్మె సెగలు!

By Ravi

Strike
గుర్గావ్‌లో ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్లాంటులో సమ్మె సెగలు ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంటులో పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లను కంపెనీ యాజమాన్యం విధుల నుంచి తొలగించి వేయడంతో సమస్య ప్రారంభమైంది. సస్పెండ్ చేసిన వర్కర్లను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేనట్లయితే, హోలీ పండుగ తర్వాత సమ్మెకు దిగుతామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.

అకారణమైన క్రమశిక్షణ చర్యలపై ఈ యూనియన్‌కు చెందిన అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ కుమార్‌‌లతో పాటుగా ప్రదీప్‌ కుమార్‌ అనే కార్మికుడిని కంపెనీ యాజమాన్యం సప్పెండ్‌ చేసింది. ఈ విషయంపై వారు యాజమాన్యంతో పాటు కార్మికశాఖతో కూడా చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదని, కార్మికులు మరో 15 -20 రోజులపాటు వేచిచూసి హోలీ తర్వాత తమ డిమాండ్లు తీర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ తెలిపారు.

ఈ విషయమై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) అనిల్ ముంజాల్ వ్యాఖ్యానిస్తూ, స్ట్రైక్ గురించి వర్కర్లు తమకు నోటీసు గానీ లేదా సమాచారం కానీ ఇవ్వలేదని, ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కంపెనీ యొక్క ఉన్నతాధికారులపై చేయి చేసుకున్నందుకే సదరు యూనియన్ జనరల్ సెక్రటరీని, ప్రెసిడెంట్‌ను సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
Trouble is brewing at the Gurgaon plant of Suzuki Motorcycle India with workers threatening to go on strike after Holi demanding reinstatement of three suspended colleagues.
Story first published: Friday, March 22, 2013, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X