హైదరాబాద్‌లో ట్రైయంప్ డీలర్‌షిప్; డిసెంబర్‌లో బుకింగ్స్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ట్రైయంప్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆరంభంలోనే ఒక్కసారిగా 10 మోడళ్లను దేశీయ విపణిలో విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ బైక్ బోన్నెవిల్లే నుంచి టాప్-ఎండ్ బైక్ రాకెట్ 3 రోడ్‌స్టర్ వరకు భారత్‌లో లభ్యం కానున్నాయి. దేశీయ విపణిలో వీటి ధరలు రూ. 5.7 లక్షలు-రూ.20 లక్షల రేంజ్‌లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

ముందుగా హైదరాబాద్‌లో..
ట్రైయంప్ డిసెంబర్ చివరి నాటికి ముందుగా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనుంది. అనంతరం ఢిల్లీ, ముంబై నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని కంపెనీ డెరైక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్ - గ్లోబల్) పాల్ స్ట్రాడ్ వివరించారు. వచ్చే ఏడాది(2014)లో కలకత్తా, పూనే, అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, చెన్నై, కొచ్చిన్, గోవా నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించనున్నారు.


బుకింగ్‌లు, డెలివరీలు
డిసెంబర్ 2013 రెండో వారం నుంచి బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభిస్తామని, జనవరి 2014 నుంచి డెలివరీలు చేస్తామని ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ సంబ్లి చెప్పారు.

భారత్ ఎంట్రీకి రెండేళ్ల సమయం..
పూర్తిస్థాయిలో భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ట్రైయంప్‌కు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ట్రైయంప్ తమ ప్రీమియం బైక్‌లను ఆవిష్కరించింది. వాస్తవానికి అదే సంవత్సరంలో భారత్‌లో కార్యకాలాపాలు ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల జాప్యం జరిగింది.

Triumph Bike

హెడ్‌డిఎఫ్‌సి ద్వారా రుణ సదుపాయం..
భారత మార్కెట్లో ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, కొనుగోలుదారులకు తమ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు గాను, ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఈ ఒప్పందంలో భాగంగా, కస్టమర్లకు హెడ్‌డిఎఫ్‌సి ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తామని పాల్ స్ట్రాడ్ తెలిపారు.

ఇండియాలోనే అసెంబ్లింగ్..
ట్రైయంప్ ఇండియా భారత మార్కెట్లో మొత్తం 10 మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఆరు మోడళ్లను (బోన్నెవిల్లె , బోన్నెవిల్లె టి100, డేటోనా 675ఆర్, స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్, థ్రక్స్టన్) మానేసర్‌లో ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ కేంద్రంలో అసెంబ్లింగ్ చేయనున్నారు. మిగిలిన నాలుగు మోడళ్లను (రాకెట్ త్రి రోడ్‌స్టర్, టైగర్ ఎక్స్‌ప్లోరర్, టైగర్ 800 ఎక్స్‌సి, థండర్‌బర్డ్ స్టార్మ్‌) పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు.

Most Read Articles

English summary
Triumph will initially assemble its products at its Manesar, Haryana facility. Triumph India, headed by Mr. Vimal Sumbly has already set up dealerships in Delhi, Mumbai, Hyderabad and Bangalore. Next year its dealer network will be extended to Kolkata, Pune, Ahmedabad, Chandigarh, Jaipur, Chennai, Cochin and Goa.
Story first published: Friday, November 29, 2013, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X