బైక్‌ల తయారీ కోసం జట్టుకట్టిన బిఎమ్‌డబ్ల్యూ - టీవీఎస్

By Ravi

BMW Bike
భారత మార్కెట్లో 500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసేందుకు చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ద్విచక్ర వాహనం దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మరియు జర్మనీకి చెందిన లగ్జరీ మోటార్‌సైకిల్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్‌లు చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా టీవీఎస్, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలు తయారు చేసే ద్విచక్ర వాహనాలను దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోకూడా విక్రయించేందుకు సన్నాహాలు చేయనున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ సాంకేతిక సహకారాన్ని ఉపయోగించుకొని తమ ప్లాంటులో అధునాతన మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తమ ఒప్పందంలో భాగంగా, మొదటి ఉత్పత్తిని 2015 నాటికి మార్కెట్లో విడుదల చేస్తామని, ఇందుకోసం రూ.142 కోట్లు పెట్టుబడులు వెచ్చిస్తున్నామని ఆయన తెలిపారు. బైక్‌ల డెవలప్‌మెంట్, టెస్టింగ్ వ్యయాన్ని బిఎమ్‌డబ్ల్యూ భరిస్తుందని శ్రీనివాసన్ వివరించారు.

ద్విచక్ర వాహనాల తయారీలో అనుభవం ఉన్న టీవీఎస్‌ మోటార్‌ కంపెనీతో భాగస్వామ్యం వలన తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చి తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్‌ కోర్‌ సెగ్మెంట్‌ ప్రెసిడెంట్‌ స్టీపెన్‌ స్కీలర్‌ తెలిపారు. ఇదివరకు జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్ కార్పోరేషన్‌తో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం నుంచి టీవీఎస్ విడిపోయింది.

Most Read Articles

English summary
It is finally official. Today at a press conference held in Chennai, TVS Motor Company, India's fourth largest and BMW Motorrad, Europe's second largest two wheeler manufacturers made it official what was rumored for quite sometime. The two leading two wheeler manufacturers announced a long term cooperation agreement.
Story first published: Tuesday, April 9, 2013, 10:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X