2015-16 నాటికి మేమే నంబర్ వన్: హోండా మోటార్‌సైకిల్

By Ravi

Honda CB Trigger
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) 2015-16 నాటికి భారతదేశపు ద్విచక్ర వాహనా మార్కెట్లో నెంబర్‌ వన్ స్థానాన్ని దక్కించుకోగలమని ధీమా వ్యక్తం చేస్తోంది. మరిన్ని కొత్త ఉత్పత్తులను విపణిలోకి ప్రవేశపెట్టడంతో పాటుగా వివిధ మార్కెటింగ్ ప్రణాళికలతో ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్‌ను ఓవర్‌టేక్ అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగలమని హెచ్ఎమ్ఎస్ఐ భావిస్తోంది.

ఇప్పటి వరకూ 3వ స్థానంలో ఉన్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, తాజాగా అమ్మకాల పరంగా 2వ స్థానంలో ఉన్న దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటోను ఓవర్‌టేక్ చేసిన ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ ప్రథమ స్థానంలోను, హెచ్ఎమ్ఎస్ఐ ద్వితీయ స్థానంలోను, బజాజ్ ఆటో తృతీయ స్థానంలోను ఉన్నాయి.

తమ సరికొత్త 150సీసీ బైక్ 'సిబి ట్రిగ్గర్'ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా హెచ్ఎమ్ఎస్ఐ ఆపరేటింగ్ ఆఫీసర్ షింజి అవోయమ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత మార్కెట్లో తమకు హీరో మోటోకార్ప్ కన్నా బజాజ్ ఆటోనే ప్రధాన ప్రత్యర్థని అన్నారు. నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో మోటో క్రమంగా తన మార్కెట్ వాటాను కోల్పోతోందని, అదే సమయంలో తమ మార్కెట్ వాటా గణనీయంగా పెరుగుతుందని షింజి చెప్పారు. త్వరలో 3-4 కొత్త మోడళ్లను అందించనున్నామని, కొత్త ప్లాంట్ ఏర్పాటుకు పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు.

కర్నాటకలోని నర్సాపూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో మరో మూడు నెలల్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వాహన మార్కెట్లో మందగమనం మరింత కాలం కొనసాగినట్లయితే 2015-16 నాటికి భారత ద్విచక్ర వాహన సెగ్మెంట్లో నంబర్ వన్ హెచ్ఎమ్ఎస్ఐ నిలుస్తుందని ఆయన అన్నారు. హెచ్ఎమ్ఎస్ఐ గడచిన ఏప్రిల్‌ 2012 నుంచి ఫిబ్రవరి 2013 వరకు 23.67 లక్షల యూనిట్లు విక్రయించగా, ఇదే సమయంలో బజాజ్‌ ఆటో 22.82 లక్షల యూనిట్లను, హీరోమోటోకార్ప్‌ మాత్రం 54.61 యూనిట్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Japanese two-wheeler manufacturer Honda Motorcycle and Scooter India Pvt Ltd (HMSI) said it could become the number one two-wheeler maker in India by 2015-16 if the current market slowdown prolonged.
Story first published: Tuesday, March 12, 2013, 15:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X