మార్చ్ అమ్మకాల్లో 20 శాతం వృద్ధిని కనబరిచిన యమహా

ఆటోమొబైల్ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగుతున్నప్పటికీ, జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్ గత నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. మార్చి 2013లో యమహా మొత్తం 50,473 ద్విచక్ర వాహనాలను విక్రయించి 20.5 శాతం వృద్ధిని కనబరిచింది. గతేడాది ఇదే సమయంలో 41,886 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ ఎగమతులు కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి.

మార్చి 2013లో యమహా మొత్తం 14,691 ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసి, 22 శాతం వృద్ధిని కనబరిచింది. అంతకు ముందు సంవత్సరం మార్చి నెలలో కంపెనీ ఎగుమతులు 12,067 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 29,819 యూనిట్ల నుంచి 35,782 యూనిట్లకు పెరిగి 20 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Yamaha Ray

ఈ సందర్భంగా, ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. తమ పటిష్టమైన ప్రోడక్ట్ పోర్ట్‌‌ఫోలియో, వినియోగదారుల విశ్వసనీయత మరియు కొత్త యమహా రే స్కూటర్‌లతో గడచిన నెలలో ప్రోత్సాహకర వృద్ధిని కళ్లజూసామని, భవిష్యత్తులోనూ ఇదే విధమైన వృద్ధిని కనబరచగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

యమహా తొలిసారిగా 1985లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. యమహా ఇండియాకు ఉత్తరప్రదేశ్‌లోని సర్జాపూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్లలో తయారైన మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా, పొరగు దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తుంది. యమహాకు దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.

ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్ & ఎస్‌జెడ్-ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc) మరియు రే (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Yamaha Motor India Sales Pvt. Ltd. has registered a growth of 20.5% in sales during March 2013 as compared to the corresponding period last year. The company continues to maintain an upward trend in sales on the back of its superb product line-up, the new scooter Ray, which has received stupendous response and innovative on- going marketing activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X