యమహా నుంచి ప్రపంచంలో కెల్లా అత్యంత చవక బైక్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్ భారత మార్కెట్లో ఓ చవక బైక్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన బైక్‌గా నిలుస్తుందని (ధర 500 డాలర్లు, అంటే సుమారు రూ.27,000) కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్‌లో ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన యమహా మోటార్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా(వైఎమ్ఆర్‌ఐ) ఈ చవక్ బైక్‌ను అభివృద్ధి చేస్తుందని ఇండియా మయహా మేనేజింగ్ డైరెక్టర్ తోషికజు కోబయాషి తెలిపారు.

ఈ చవక బైక్‌లో 100సీసీ లేదా అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉండే ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. అయితే, ఈ చవక బైక్‌ను ఎప్పటిలోగా మార్కెట్లో విడుదల చేసే అంశాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. తొలుతగా ఈ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తామని, అనంతరం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చేస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత చవక ధరకు బైక్‌ను, వాహన విడిభాగాలను తయారు చేయడమే తమ లక్ష్యమని కోబయాషి అన్నారు.

Yamaha BIke

యమహా ఇప్పటి వరకూ యువతను దృష్టిలో ఉంచుకొని, స్పోర్టీ, స్టైలిష్, పెర్ఫామెన్స్ బైక్‌లపై దృష్టి సారించిందని, ఇకపై మాస్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని చౌక ధరల్లో లభించే బైక్‌ల తయారీపై ప్రత్యేక దృష్టిని పెడుతుందని ఆయన అన్నారు. తాము ఉత్పత్తి చేయాలనుకుంటున్న ఈ చవక బైక్‌ను భారత్‌లోనే తయారు చేయటం వలన, దీని ఉత్పాదక వ్యయం తక్కువగా ఉంటుందని, ఫలితంగా సరసమైన ధరకే దీనిని విక్రయించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇండియా యమహా మోటార్ సీఈవో, ఎమ్‌డి, హిరోయుకి సుజుకి తెలిపారు.

చవక ధరకే ద్విచక్ర వాహనాలను అభివృద్ధి చేసేందుకు ఇండియా యమహా మోటార్ సూరజ్‌పూర్‌లో ఓ కొత్త అర్ అండ్ డి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది యమహాకు 5వ గ్లోబల్ ఆర్ అండ్ డి సెంటర్ కావటం విశేషం. కాగా.. చెన్నైలో యమహా నిర్మిస్తున్న ప్లాంట్‌లో, భారత్‌లో రెండవ ఆర్ అండ్ డి కేంద్రాన్ని 2015 నాటికి ప్రారంభించనుంది. ఇదిలా ఉండగా, 2016 వరకూ ప్రతి ఏటా ఓ కొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Yamaha Motor Co., Ltd. has established Yamaha Motor Research and Development India Pvt. Ltd. (YMRI) in Surajpur, State of Uttar Pradesh, which is to become the motorcycle R&D headquarters in India. This initiative is intended to increase Yamaha's manufacturing competitiveness in the country. The function of the India Procurement Center established last year has been transferred and incorporated into the new company, and will now operate as the India Integrated Development Center.
Story first published: Wednesday, April 10, 2013, 9:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X