నీటితో నడిచే బైక్‌ను తయారు చేసిన యువ మెకానిక్

By Ravi

Water Powered Bike
లీటరు పెట్రోల్ ధర సుమారు 80 రూపాయల వరకు ఉంటోంది. ఇంత అధిక ధర వెచ్చించి పెట్రోల్ కొని బైక్ నడపాలంటే, సామాన్యులకు కష్టంగానే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అర లీటర్ పెట్రోల్‌తో 110 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్ లభిస్తే ఎలా ఉంటుంది..?
అదెలా సాధ్యం అంటారా..? అయితే, ఈ కథనం చదవండి..!

జగిత్యాలలోని మల్యాల ప్రాంతానికి చెందిన కస్తూరి ప్రసాద్ అనే ఓ యువ మెకానిక్ పెట్రోల్‌తో పాటుగా నీటిని కూడా ఇంధనంగా చేసుకొని నడిచే మోటార్‌సైకిల్‌ను సృష్టించి శభాష్ అనిపించుకున్నాడు. డ్యూయెల్ ఫ్యూయెల్‌తో (పెట్రోల్, నీరు) బైక్‌ను నడిపేందుకు గాను ప్రసాద్ ఓ యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరాన్ని వాటర్ బాటల్‌కు అనుసంధానం చేసి అర లీటర్ పెట్రోల్, 2 లీటర్ల నీటిని ఉపయోగించి బైక్ నడిపాడు.

ఈ విధంగా అర లీటర్ పెట్రోల్, 2 లీటర్ల నీటితో 110 కిలోమీటర్ల మైలేజీని పొందవచ్చని ప్రసాద్ వివరించాడు. తాను తయారు చేసిన పరికరం సాయంతో వాటర్ బాటిల్ నుండి నీటిని కార్పెటర్‌కు పైపుకు సరఫరా అయ్యేట్లు చేశాడు. ఇదే టెక్నాలజీని కార్లలో కూడా ఉపయోగించుకోవచ్చని, ఆ దిశగా తాను ప్రయత్నాలు చేస్తున్నానని ప్రసాద్ తెలిపాడు. నీటితో నడిచే బైక్‌ను తయారు చేసేందుకు కేవలం రూ.4500 మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చాడు.

ఈ పరికరాన్ని అమర్చుకోవటం వలన వాహనానికి వచ్చే నష్టం ఏమీ లేదని, పైగా దీని వలవ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు ఎవైరానా ముందుకు వచ్చి చేయూతనందిస్తే, ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచి అందరికీ అందుబాటులోకి వచ్చేలా అభివృద్ధి చేస్తానని ప్రసాద్ తెలిపారు.

Most Read Articles

English summary
A young mechanic from Jagtial has created a unique motorcycle that runs on water. Kastoori Prasad from Malyala developed an equipped which powers water as fuel to the regular bike.
Story first published: Tuesday, October 22, 2013, 10:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X