అప్‌డేటెడ్ 2014 హీరో ప్లెజర్ స్కూటర్ విడుదల; ధర రూ.49,126

By Ravi

ఇటీవలే స్ప్లెండర్ ఐస్మార్ట్, హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇప్పుడు తాజాగా మరో సరికొత్త అప్‌డేటెట్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: హీరో మోటోకార్ప్ నుంచి 15 కొత్త మోడళ్ల విడుదల!

హీరో మోటోకార్ప్ అందిస్తున్న ప్లెజర్ స్కూటర్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త 2014 హీరో ప్లెజర్ స్కూటర్ ధర రూ.49,126 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలోనే కంపెనీ ఈ కొత్త మోడళ్లంటినీ తొలిసారిగా ఆవిష్కరించింది. కాగా.. ఈ కొత్త 2014 హీరో ప్లెజర్ స్కూటర్‍‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

2014 హీరో ప్లెజర్ స్కూటర్

కొత్త అప్‌డేటెట్ 2014 హీరో ప్లెజర్ స్కూటర్ మునుపటి వెర్షన్ కన్నా మరింత అందంగా లభిస్తుంది. దీని డ్యూయెల్ టోన్ కలర్ (ఆరెంజ్ అండ్ వైట్) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

2014 హీరో ప్లెజర్ స్కూటర్

ఈ కొత్త ప్లెజర్ స్కూటర్‌లో రెగ్యులర్ స్టీల్ వీల్స్‌కు బదులుగా అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. ఇండికేటర్ ల్యాంప్స్, గ్రాబ్ రెయిల్స్, టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను కూడా మోడిఫై చేశారు.

2014 హీరో ప్లెజర్ స్కూటర్

ఈ సరికొత్త 2014 హీరో ప్లెజర్ స్కూటర్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పు ఏంటంటే, ఇది ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబిఎస్)తో లభిస్తుంది. ఈ సిస్టమ్‌లో భాగంగా ఏ బ్రేక్‌ను (ముందు లేదా వెనుక బ్రేక్‌ను) అప్లయ్ చేసినా, రెండు బ్రేకులు పనిచేయటం ప్రారంభించి, బ్రేకింగ్ దూరాన్ని తగ్గించడం ద్వారా ప్రమాదాన్ని నివారించడం (తీవ్రతను తగ్గించడం) జరుగుతుంది.

2014 హీరో ప్లెజర్ స్కూటర్

ఈ స్కూటర్‌లో సైడ్ స్టాండ్ ఇండికేటర్, గ్లవౌ బాక్స్‌లో మొబైల్ చార్జింగ్ పాయింట్, ట్యూబ్‌లెస్ టైర్లు, అండర్ సీట్ స్టోరేజ్ లైట్ వంటి చెప్పుకోదగిన ఫీచర్లున్నాయి.

2014 హీరో ప్లెజర్ స్కూటర్

ఇంజన్ పరంగా కొత్త ప్లెజర్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 102సీసీ ఇంజన్ గరిష్టంగా 6.83 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా 77 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

2014 హీరో ప్లెజర్ స్కూటర్

కొత్త 2014 హీరో ప్లెజర్ రెండు వేరియంట్లలో (అల్లాయ్ వీల్స్, స్టీల్ వీల్స్) ఆప్షన్‌తో లభిస్తుంది. స్టీల్ వీల్స్ వేరియంట్ ధర అల్లాయ్ వీల్స్ వేరియంట్ ధర కన్నా దాదాపు 1500 రూపాయలు తక్కువగా ఉంటుంది.

మరి ఈ కొత్త అప్‌గ్రేడెడ్ హీరో ప్లెజర్ స్కూటర్ మీకు నచ్చిందా?

Most Read Articles

English summary
Hero MotoCorp has launched the facelifted 2014 Pleasure automatic scooter in India for a price of Rs 49,126 (ex-showroom, Mumbai).
Story first published: Wednesday, April 2, 2014, 10:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X